వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాభాలు ఆర్జించిన తొలి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్.. సంకేతాలు ఏమిస్తోంది.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐఆర్‌సీటీసీకి చెందిన తొలి ప్రైవేట్ ఎక్స్‌ప్రెస్ రైలు తేజస్ ఈ అక్టోబర్ నెలనాటికి రూ.70 లక్షలు లాభాలను ఆర్జించింది. ఇక మొత్తం టికెట్లు రూ.3.70 కోట్లకు అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. తొలి ప్రయత్నంలోనే భారీ లాభాలను ఆర్జించడంతో ఇక భారతీయ రైల్వేల్లో ప్రైవేట్ రైళ్లు హవా ప్రారంభమవుతాయనే సంకేతాలు వస్తున్నాయి.

దేశంలో తొలి కార్పొరేట్ రైలు 'తేజస్’: ప్రత్యేకతలెన్నో.. త్వరలో దేశ వ్యాప్తంగా!దేశంలో తొలి కార్పొరేట్ రైలు 'తేజస్’: ప్రత్యేకతలెన్నో.. త్వరలో దేశ వ్యాప్తంగా!

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పోరేషన్‌ ఆధ్వర్యంలో లక్నో - ఢిల్లీల మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీస్తోంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో భారత దేశంలోని 50 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని భారతీయ రైల్వే శాఖ భావించింది. ఇందుకోసం ప్రైవేట్ భాగస్వాములను కూడా ప్రోత్సహించాలని యోచించింది. అంతేకాదు 150 ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లను కూడా నెట్‌వర్క్‌పై తిప్పాలని భావించింది. ఈ క్రమంలోనే తొలి ప్రైవేట్ రైలు తేజస్‌ను ప్రారంభించింది.

Profits for Tejas express: IRCTC says Rs.70 lakhs profit on first Private Train

అక్టోబర్ 5వ తేదీన అధికారికంగా ప్రారంభమైన తేజస్ 80 నుంచి 85శాతం ఆక్యుపెన్సీని చూపించిదని అధికారులు చెప్పారు. ఇక అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 28 28 వరకు ఈ రైలు ప్రయాణించింది. ఆరు రోజులు మాత్రమే ఈ రైలు ప్రయాణిస్తుంది. మొత్తం 21 రోజులకు గాను ఈ రైలు నిర్వహణలో ఐఆర్‌సీటీసీకి అయిన ఖర్చు రూ. 3 కోట్లు. రోజుకు సగటున రూ.14 లక్షలు ఖర్చు చేసింది ఐఆర్‌సీటీసీ. ప్రయాణికులకు టికెట్ రూపంలో రూ.17.50 లక్షలు వసూలు చేసింది. ఢిల్లీ -లక్నో రూట్లో భారతీయ రైల్వేల కింద కాకుండా ఒక ప్రైవేట్ సంస్థ కింద రైలు నడవడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఇక ఈ రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లను చేసింది ఐఆర్‌సీటీసీ. కాంబినేషన్ మీల్స్, 25 లక్షల వరకు ప్రయాణికుల బీమా, ఒకవేళ రైలు రావడం ఆలస్యం అయితే ప్రయాణికులకు పరిహారం చెల్లింపు లాంటివి ఆకట్టుకుంటాయి. గత నెలలో ప్రైవేట్ రైళ్ల నిర్వహణ సాధ్యసాధ్యాలపై నివేదిక ఇవ్వాలంటూ కొంతమంది ప్రభుత్వ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించింది. అయితే వీరు ఇంకా తొలిసారి సమావేశం కావాల్సి ఉంది.

English summary
IRCTC's Tejas Express has made a profit of around Rs 70 lakh till October this year while earning revenue of nearly Rs 3.70 crore through sale of tickets, sources said, signalling a steady start for the Railways' first "privately" run train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X