వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Rihanna, Mia Khalifaలాంటోళ్లకు అమిత్ షా కౌంటర్ -దేశ ఐక్యతను దెబ్బతీయలేరంటూ..

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశరాజధాని ఢిల్లీలో 70 రోజులుగా రైతులు నిరసనలు చేస్తుండటం, ఆందోళనలను అణిచేసే క్రమంలో కేంద్రం బలప్రయోగానికి పాల్పడటం, ఇంటర్నెట్ సేవలు నిలిపేయడం తదితర అంశాలిప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యాయి. ఢిల్లీ శివారుల్లో జరుగుతోన్న రైతుల నిరసనలపై వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సెలబ్రిటీలు వరుస ట్వీట్లు చేయడం, భాతర ప్రభుత్వం హెచ్చరించిన తర్వాత కూడా వారి తీరు మారకపోవడం రచ్చకు దారి తీసింది. ఈ వవ్యవహారంపై సాక్ష్యాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారిప్పుడు..

మియా ఖలీఫాపై మోదీ సర్కార్ ఫైర్ -గ్రెటా, మీనా, రిహానాపైనా ఆగ్రహం -రైతుల పోరులో సంచలనంమియా ఖలీఫాపై మోదీ సర్కార్ ఫైర్ -గ్రెటా, మీనా, రిహానాపైనా ఆగ్రహం -రైతుల పోరులో సంచలనం

 ఐక్యతను దెబ్బతీయలేరు..

ఐక్యతను దెబ్బతీయలేరు..

రైతుల నిరసనలపై తప్పుడు సందేశాలిస్తున్నారంటూ ఫారిన్ సెలబ్రిటీలపై కేంద్రం ఫైరైంది. భారత దేశ ఐక్యతను ఎలాంటి దుష్ప్రచారం దెబ్బతీయలేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు నిరసనలపై విదేశాలకు చెందిన కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, భారతదేశ ఐక్యతను ఇలాంటివి దెబ్బతీయలేవన్నారు. దేశం అత్యున్నత స్థాయికి చేరకుండా ఏ దుష్ప్రచారమూ నిలువరించలేదని బుధవారం ఒక ప్రకటన చేశారు. తప్పుడు ప్రచారాలతో దేశ పురోగతిని కూడా అడ్డుకోలేరని, భారత భవిష్యత్‌ను నిర్ణయించేది విషప్రచారాలు కాదు.. అభివృద్ధే అని షా స్పష్టం చేశారు.

 ట్విటర్ లో రచ్చరచ్చ..

ట్విటర్ లో రచ్చరచ్చ..

ఢిల్లీలో రైతుల ఆందోళనపై పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్ వైరల్‌గా మారిపోయింది. ఆ తర్వాత బాగా పాపులరైన సెలబ్రిటీలెందరో ఈ అంశంపై వరుస ట్వీట్లు చేయడంతో భారత రైతుల ఉద్యమం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మేన కోడలు మీనా హ్యారిస్, పోర్న్ స్టార్ మియా ఖలీఫా, నటి, మోడల్ అమాండ, పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్ బర్గ్ సహా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు.. భారత రైతులకు మద్దతుగా ప్రకటనలు చేశారు. వీటిపై మంగళ, బుధవారాల్లో సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరిగింది. ఈ క్రమంలోనే..

సెలబ్రిటీలపై మోదీ సర్కారు ఆగ్రహం..

సెలబ్రిటీలపై మోదీ సర్కారు ఆగ్రహం..

ఢిల్లీలో రైతు నిరసనలపై వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ సెలెబ్రెటీలు ట్వీట్లు చేయడంపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్వీట్లలో వారు వ్యక్తపరిచిన విషయాలకు ఏమాత్రం కచ్చితత్వం లేదని, అవి బాధ్యతారాహిత్యమైన ట్వీట్లని మండిపడింది. ఈ మేరకు విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ''సంచలనాలకు మొగ్గు చూపే వ్యక్తులే ఇలా చేస్తున్నారు. ఆ ట్వీట్లకు ఏమాత్రం కచ్చితత్వం లేదు. బాధ్యతారాహిత్యం. భారత దేశానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతును కూడగట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. అలాంటి శక్తులే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో గాంధీ విగ్రహాలను ధ్వంసం చేశాయి. ఇలాంటి వారి ట్వీట్లతో దేశం చాలా బాధపడింది.'' అని విదేశాంగ శాఖ పేర్కొంది.

జగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలుజగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలు

English summary
Union home minister Amit Shah on Wednesday said propaganda can't decide India's progress. Sharing the statement of the ministry of external affairs in which the ministry termed international support to farmers' protest as irresponsible, Amit Shah said propaganda can neither disrupt India's unity nor can decide India's fate. "India stands united and together to achieve progress," he wrote with hashtags IndiaAgainstPropaganda and #IndiaTogether. Many ministers and BJP leaders tweeted using these hashtags, first used by the MEA in its statement, committing to India's unity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X