• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభత్వంపై పాజిటివ్ న్యూస్ ప్రమోట్ చేయండి: వర్క్‌షాప్‌లో ఉన్నతాధికారులకు సూచన

|

కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం పనితీరు బాగుందని, ప్రభుత్వం పట్ల పాజిటివ్ ఇమేజ్ ఉండేలా, ప్రభుత్వం తలపెట్టిన మంచి కార్యక్రమాలను, అదే సమయంలో ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజలకు తెలిసేలా కార్యాచరణ రూపొందించాలని పేర్కొంటూ ఆన్‌లైన్ వర్క్ షాప్ కార్యక్రమం జరిగింది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 300 మంది కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరైనట్లు ప్రముఖ జాతీయ ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ హిందుస్తాన్ టైమ్స్ కథనం రాసుకొచ్చింది. 90 నిమిషాల పాటు జరిగిన ఈ ఆన్‌లైన్ వర్క్ షాప్‌లో కేంద్ర సమాచారా ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ పాల్గొని ప్రసంగించారు. కోవిడ్ 19 విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో వీటిని ఎలా నియంత్రించాలో అనే అంశంపై ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైనా ఆయా శాఖల కార్యదర్శులకు కేంద్రమంత్రి పలు సూచనలు చేసినట్లు హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. కరోనా సమయంలో అన్నీ పాజిటివ్ న్యూస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రకాష్ జవడేకర్ సూచించినట్లు తెలుస్తోంది.అయితే ప్రకాష్ జవడేకర్ కార్యాలయం మాత్రం దీనిపై స్పందించలేదు.

ఇక మీటింగ్ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను స్లైడ్స్ రూపంలో ప్రదర్శించినట్లు హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. కోవిడ్-19 వార్తలకు సంబంధించిన స్లైడ్స్, ఇక మూడు సాగు చట్టాలపై ప్రభుత్వం పంపిన సందేశంకు సంబంధించిన స్లైడ్స్ కూడా ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సంప్రదాయ పద్దతిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రెస్ రిలీజులు ఇవ్వండం వర్కౌట్ కావడం లేదని ఇకపై ఫోటోలు, వీడియోలు విడుదల చేయాల్సిందిగా ఆయా శాఖల మీడియా డిపార్ట్‌మెంట్లకు ఆదేశాలు జారీ అయినట్లు మీటింగ్‌లో పాల్గొన్న ఓ ఉన్నతాధికారి చెప్పినట్లు హిందుస్తాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

Promote positive news on govt Officials speak in online workshop

ఉదాహరణగా పలు దేశాల నుంచి వచ్చిన ఆక్సిజన్‌ సిలిండర్లు ఇతర మెడికల్ ఎక్విప్‌మెంట్ విమానాశ్రయాల్లోనే ఎందుకు ఉందని ఢిల్లీ హైకోర్టు సోమవారం రోజున ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఓ టీవీ ఛానెల్ చేసిన ట్వీట్లకు విపరీతమైన స్పందన వచ్చింది. టీవీల్లో ఇవన్నీ ప్రసారమవడం వల్లే ఢిల్లీ కోర్టు ప్రశ్నించాల్సి వచ్చిందనే అభిప్రాయంకు వచ్చినట్లు హిందుస్తాన్ టైమ్స్ తన కథనంలో ప్రచురించింది. ఈ రోజుల్లో ఏ అంశమైనా ఇట్టే బయటకు పొక్కేస్తోందని.. అది పొక్కకముందే జాగ్రత్తచర్యలు తీసుకోవాలని సమావేశంలో ప్రముఖులకు మంత్రి హిత బోధ చేసినట్లు సమాచారం. ఒక వేళ ఏదైనా న్యూస్ ఛానెల్ వార్తను బ్రేక్ చేస్తే ప్రభుత్వం తరపున వినిపించే వెర్షన్ పై ప్రభావం పడుతుందని మై గౌవ్ సీఈఓ అభిషేక్ సింగ్ ప్రెజెంటేషన్ సందర్భంగా చెప్పారు. ఇక ఆయా శాఖల కార్యదర్శులకు మంత్రులను కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి సమయానికి ఇన్‌పుట్స్ తెప్పించుకుని దాన్ని పాజిటివ్‌గా మలిచే ప్రయత్నం చేయాలని సూచించారు.

ఇక వ్యాక్సిన్‌ అంశంపై తమ ట్వీట్ల ద్వారా ప్రజలను ప్రభావితం చేయగల వారికోసం అన్వేషించాలని అదే సమయంలో లింక్డ్ ఇన్‌లాంటి సోషల్ సైట్స్‌లో కనెక్ట్ అయ్యేందుకు ఆసక్తితో ఉన్న వ్యక్తుల కోసం చూడాలని తమకు చెప్పినట్లు మీటింగ్‌కు హాజరైన మరో ఉన్నతాధికారి తమకు సమాచారం ఇచ్చినట్లు హిందుస్తాన్ టైమ్స్ పేర్కొంది. ఇక వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అనేది సోషల్ మీడియాలో ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్‌గా ఉన్నట్లు తాము గుర్తించినట్లు సమావేశంలో చర్చించారు. ఇందులో 70శాతం మంది తటస్థంగా ఉండగా 20శాతం మంది అసంతృప్తి వెల్లగక్కారని, 5శాతం మంది మాత్రమే ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. ఇక్కడే ప్రభుత్వ ఉన్నతాధికారులు అవకాశంగా మలుచుకుని ఎక్కవగా రికవరీల గురించి ప్రసారం చేయాలని అదే సమయంలో పాజిటివ్ వార్తలను విపరీతంగా ప్రమోట్ చేయాలని సూచించినట్లు ఆ ఉన్నతాధికారి తెలిపారు.

ఇక సమావేశంలో సోషల్ మీడియాపై కూడా చర్చించినట్లు సమాచారం. స్పందన ఎంత వేగంగా వస్తోంది, ఇన్ఫోగ్రాఫిక్స్ వినియోగం, స్పష్టమైన సందేశం పంపడం వంటిపై దృష్టి సారించాలని సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సమాచారం వల్ల చర్య జరగదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మాజీ అధికారి నీలం కపూర్ అభిప్రాయపడ్డారు. ఆరోగ్య రంగంలో తనకున్న అనుభవంపై మాట్లాడారు. మాస్కులు, గుమికూడిన ప్రజలపై సమాచార లోపంతో సరైన సందేశం పంపడంలో అవకాశం జారవిడుచుకున్నట్లు నీలం కపూర్ తెలిపారు. మెసేజ్ పంపడం చాలా ముందుగా జరిగి ఉండాల్సి ఉన్నిందని నీలం అభిప్రాయపడ్డారు. ఇక ఇమేజ్ కన్సల్టెంట్ దిలీప్ చెరియాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం గురించి గొప్పలు చెప్పేందుకు వ్యక్తులను నియమించుకోవడమంటే ఒక మంచి పేరున్న సంస్థ నాణ్యతలేని ఉత్పత్తిని అమ్మడమే అని అన్నారు. ఇది వారికి చెడ్డపేరే తెస్తుంది తప్ప మంచి పేరు రాదని అభిప్రాయపడ్డారు. ఇక పాజిటివ్ న్యూస్ పనిగట్టుకుని ప్రసారం చేయడమంటే అది కచ్చితంగా ప్రభుత్వంపై అనుమానం కలిగిస్తుందని చెప్పారు.

English summary
Top Central government officials attend session on boosting image, perception
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X