వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలపై కొత్త చట్టం, కాల్‌సెంటర్ జాబ్స్‌కు దెబ్బే

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త చట్టం లక్షలాది మంది భారతీయుల ఉద్యోగుల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం కన్పిస్తోంది.ఔట్ సోర్సింగ్ చేయని కంపెనీలకు అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రాధాన్యం ఇచ్చేందుకు చట్టాన్ని రూపొందిస్తున్నారు.ఈ చట్టం అమల్లోకి వస్తే ఇండియాకు చెందిన టెక్కీలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలను చేపట్టిన తర్వాత తీసుకొస్తున్న చట్టాలు అనేక ఇండియన్ టెక్కీలకు ఇబ్బందులను కల్గిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ట్రంప్ హమీ ఇచ్చారు.

ఈ హమీ మేరకు ట్రంప్ నిర్ణయాలు తీసుకొంటున్నారు. హెచ్ 1 బీ వీసాల విషయంలో తీసుకొన్న నిర్ణయం కూడ ఇండియాకు చెందిన టెక్ కంపెనీలపై, ఇండియా టెక్కీలపై ప్రభావం చూపుతున్నాయి.

 కాల్ సెంటర్ ఉద్యోగాలపై అమెరికా కొత్త చట్టం

కాల్ సెంటర్ ఉద్యోగాలపై అమెరికా కొత్త చట్టం

అమెరికా ప్రభుత్వం తాజాగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తోంది. కాల్ సెంటర్ ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ కింద విదేశాలకు తరలిస్తున్న అమెరికన్ కంపెనీల జాబితాను తయారు చేయాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకొంది. ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ చేయని కంపెనీలకు అమెరికా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని ఆ దేశ ప్రతినిధుల సభలో చట్టాన్ని ప్రతిపాదించాలని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయం తీసుకొంది.

 వినియోగదారుడికే ఆ వివరాలు తెలియాలి

వినియోగదారుడికే ఆ వివరాలు తెలియాలి

కాల్ సెంటర్ కంపెనీలు తాము సేవలు అందిస్తున్న ప్రదేశాన్ని వినియోగదారులకు తెలపాల్సిన అవసరం ఉందని ఆ చట్టంలో ప్రతిపాదించనున్నారు. అమెరికా లో కాకుండా ఇతర దేశాల నుండి అందిస్తున్న సేవలను స్వదేశంలోని సర్వీస్ ఏజంట్‌కు బదిలీ చేయాల్సిందిగా కోరే హక్కును కల్పించాలని ఆ చట్టంలో ప్రతిపాదించనున్నారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభావం

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభావం

అమెరికా ప్రస్తుతం తల పెట్టిన ఈ చట్టం అమల్లోకి వస్తే ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే కాల్ సెంటర్ ఉద్యోగులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమెరికా నుండి ఔట్ సోర్సింగ్ చేసే కాల్ సెంటర్ ఉద్యోగులపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు

పన్నులు తప్పించుకొనేందుకు

పన్నులు తప్పించుకొనేందుకు

అమెరికాలోని ఓహియో సెనెటర్ షెరాడ్ బ్రౌన్ ఈ కొత్త చట్టాన్ని ప్రతిపాదించాడు. అమెరికాలో పన్నులను తప్పించుకొనేందుకు చాలా కంపెనీలు కాల్ సెంటర్ ఉద్యోగాలను భారత్, మెక్సికో వంటి విదేశాలకు ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయని ఆయన ప్రతినిధుల సభలో చెప్పారు. ఏ కంపెనీ అయినా వారి కస్టమర్ సర్వీసు సిబ్బంది తోడ్పాటు లేకుండా సరిగా పనిచేయలేరని ఆయన గుర్తు చేశారు.అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
A legislation has been introduced in the Congress that would require call centre employees overseas to disclose their location and give customers a right to ask to transfer their call to a service agent in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X