వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేశ్యావాటికలు తెరిస్తే ఇక అంతే: 4 లక్షల మందికి వైరస్, 12 వేల మంది మృతి..? శాస్త్రవేత్తలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. వైరస్ వల్ల యావత్ ప్రపంచం వణికిపోతోంది. అయితే వేశ్యావాటికల వల్ల వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉంది అని అధ్యయనంలో వెల్లడైంది. లాక్‌డౌన్ వల్ల మార్చి నెల నుంచి వేశ్యా వాటికలను మూసివేసిన సంగతి తెలిసిందే. అన్ లాక్ 2.0లో తెరిస్తే ప్రమాదం పొంచి ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలుగురాష్ట్రాలు, దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ప్రభావం ఉంటుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు జర్మనీ పొలిటిషీయన్స్ ముందుకొచ్చారు. వేశ్య వాటికలను క్లోజ్ చేయాలని కోరారు. అదేవిధంగా మిగతా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.

ఫేస్ బుక్ నకిలీ అకౌంట్ లో మహిళ ఫోటోలు, వేశ్య అంటూ కామెంట్, టార్చర్, చివరికి! ఫేస్ బుక్ నకిలీ అకౌంట్ లో మహిళ ఫోటోలు, వేశ్య అంటూ కామెంట్, టార్చర్, చివరికి!

 4 లక్షల మందికి వైరస్..

4 లక్షల మందికి వైరస్..

ఒకవేళ వేశ్య వాటికలు తెరిస్తే భారతదేశంలో 4 లక్షల మందికి వైరస్ సోకుతుందని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, హర్వర్డ్ మెడికల్ స్కూల్ విద్యావేత్తలు పేర్కొన్నారు. వైరస్ సోకిన వీరిలో 12 వేల మంది చనిపోతారనే కఠోర నిజాన్ని వెల్లడించారు. వేశ్యా వాటికలను మరికొంత సమయం మూసివేస్తే కరోనా మరణాలను 60 శాతం తగ్గొంచొచ్చు అని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో వేశ్యా వాటికలు తెరవడం వల్లే జరిగే అనర్ధాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు.

 వేశ్యావాటిక క్లోజ్

వేశ్యావాటిక క్లోజ్

సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వేశ్యావాటికను మరికొన్ని రోజులు మూసివేయాలని సూచించారు. దీంతో కరోనా మరణాలను 25 శాతం తగ్గించొచ్చు అని లెక్కగట్టారు. తమ అధ్యయనానికి సంబంధించి మరిన్ని వివరాలను www.coderedcovid.orgలో చూడాలని కోరారు. కరోనా సోకితే విటుడు అనారోగ్యానికి గురైతే.. అతనికి ద్వారా పలువురికి వైరస్ వ్యాపిస్తోందని నిపుణుల బృందం కోరింది. ఒకవేళ తెలంగాణలో అలా వైరస్ వ్యాపిస్తే మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దీంతో వేశ్యా వాటికలు హాట్ స్పాట్‌లుగా నిలుస్తాయని నిపుణులు వార్నింగ్ ఇచ్చారు.

విటుల ద్వారా విజృంభణ..?

విటుల ద్వారా విజృంభణ..?

వేశ్య వద్దకు వచ్చే విటుల ద్వారా.. ఒకరికొకరికి వైరస్ సోకే అవకాశం ఉంది. సంభోగించడంతో విధిగా వైరస్ సోకుతోంది. బయటకొచ్చిన విటుడు.. ఇతరులను కలవడం, మాట్లాడటం, దగ్గరగా ఉండటంతో వైరస్ వ్యాపిస్తోంది. అలా ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకి.. విలయతాండవం చేస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయడం కేవలం వేశ్యావాటికలను మూయడమేనని బృంద సభ్యులు నొక్కి వక్కానిస్తున్నారు.

Recommended Video

Indian Space Sector Opens up For Private Companies, ప్రైవేటు భాగస్వామ్యం అవసరమే : ISRO || Oneindia
బెంగాల్‌లో 65 వేల మంది...?

బెంగాల్‌లో 65 వేల మంది...?

ఇటు బెంగాల్‌లో సెక్స్ వర్కర్లతో దర్బార్ మహిళా సమన్వయ కమిటీ పనిచేయిస్తుంది. 65 వేల మంది సెక్స్ వర్కర్లు ఉండగా, 50 వేలమందికి పైగా సభ్యులు ఉన్నారు. లాక్ డౌన్ తర్వాత వేశ్యా వాటికలను తెరిస్తే పెను ప్రమాదానికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతమంది ద్వారా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ఆందోళన చెందుతున్నారు.

English summary
prostitutes houses are the biggest hotspots in the country scientists said in study.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X