వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ స్వార్థం కోసం విద్యార్థులను వాడుకుంటారా?: గౌతం గంభీర్ ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయం వద్ద జరిగిన విద్యార్థులు ఆందోళనలపై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. వర్సిటీ విద్యార్థుల ఆందోళనలను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేశారంటూ ఆమ్ ఆద్మీ పార్టీపై మండిపడ్డారు.

'ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే విద్యార్థులను ప్రేరేపిస్తూ ప్రసంగించిన వీడియోను నేను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాను. ఎన్నో లక్ష్యాలను సాధించాలని ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చిన విద్యార్థులతో మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం' అని అరవింద్ కేజ్రీవాల్ పార్టీపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Protest At Jamia University Politicised By AAP: BJP MP Gautam Gambhir

'నేటి యువతే ఈ దేశానికి భవిష్యత్తు, మార్గనిర్దేశకులు. కులమతాలకు అతీతంగా ఈ దేశం ప్రతిఒక్కరిదీ. దేశ అభివృద్ధికి అందరూ పాటుపడుతున్నారు. అలాంటి వారికి నిరసన తెలిపేందుకు అన్ని హక్కులు ఉంటాయి. కానీ, అది ప్రజాస్వామ్య పద్ధతి చేయాలి. ప్రభుత్వం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుంది' అని గౌతమ్ గంభీర్ హితవు పలికారు.

'పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకురావడం వల్ల దేశ పౌరులెవరూ పౌరసత్వం కోల్పోయేది లేదు. విద్యార్థులు ఎవరూ చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోకూడదని కోరుతున్నాను. ఈ చట్టం భారతీయులకు వ్యతిరేకంగా కాదు. దీనికి ఎవరూ రాజకీయం చేయొద్దు' అని గౌతమ్ గంభీర్ అన్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పౌర సవరణ చట్టంపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన విషయం తెలిసిందే.

పౌరసత్వ సవరణ చట్టంపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని..చట్టాన్ని అమలు చేసి తీరుతామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రతిపక్షాలు ప్రజల్లో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయంటూ మండిపడ్డారు.

English summary
BJP MP Gautam Gambhir on Monday alleged that the protest at Jamia Millia Islamia University on Sunday against the Citizenship Amendment Act (CAA) was "politicized" by Delhi's ruling Aam Aadmi Party (AAP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X