వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆందోళనలు ఓకే.. రహదారులను నిర్భందించకండి, నిరసనకారులతో మాట్లాడేందుకు మధ్యవర్తిత్వ కమిటీ

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ షహీన్‌బాగ్‌లో ఆందోళన చేస్తోన్న వారు రహదారులు మొత్తం బ్లాక్ చేయకుండా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంది అని.. కానీ వారి నిరసనలతో ఇతరులకు ఇబ్బంది కలుగొద్దని జస్టిస్ ఎస్కే కౌల్, కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. అడ్వకేట్ అమిత్ సాహ్నీ, ఇతరులు వేసిన పిటిషన్లను సోమవారం సర్వోన్నత ధర్మాసనం విచారించింది.

నిరసన హక్కే..

నిరసన హక్కే..

డిసెంబర్ 15వ తేదీన షహీన్‌బాగ్‌లో గల కాలిండి కుంజ్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోయిందని అడ్వకేట్ అమిత్ సాహ్నీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హైకోర్టులో పిటిషన్లు ఎక్కువగా దాఖలు కావడంతో.. పిటిషన్లన్నీ సుప్రీంకోర్టు విచారిస్తోన్న సంగతి తెలిసిందే. నిరసనలకు సంబంధించి ఇబ్బంది కలుగుతోందనే పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. నిరసన తెలిపే హక్కు మీకు ఉంది, ఇవాళ మీరు ఆందోళన చేపడితే, రేపు ఇంకొకరు నిరసనకు దిగతారు. ఇందులో సందేహానికి తావులేదని పేర్కొన్నది.

ఇతర చోట కూడా..

ఇతర చోట కూడా..


షహీన్ బాగే కాదు చాలా చోట్ల నిరసనలు చేస్తామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను అమిత్ సాహ్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిరసనలతో ఎలాంటి ఇబ్బంది లేదు అని.. కానీ రహదారులను మొత్తం బ్లాక్ చేయొద్దని.. మిగతావారికి కూడా వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని సూచించింది. సమాజంలో ఒక వర్గం ఆందోళనలు చేస్తూనే ఉంటుందని, వారి సమస్యల కోసం వారు పోరుబాట పట్టారని పేర్కొన్నది. షహీన్ బాగ్ కాకుండా మరో చోట నిరసనలు చేపట్టేలా చూడాలని సూచించింది.

Recommended Video

Citizenship Amendment Act : Muslims To Fly National Flag To Samme Against CAA, NRC | Oneindia Telugu
మధ్యవర్తిత్వం..

మధ్యవర్తిత్వం..


న్యాయవాది అమిత్ సాహ్ని దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకున్న చంద్రశేఖర్ ఆజాద్, ఇతరులుతో మాట్లాడటానికి ప్రయత్నించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. షహీన్‌బాగ్ విడిచిపెట్టేందుకు గల పరిష్కార మార్గాలను చూడాలని సూచించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసు కమిషనర్‌ను ఆదేశాలు జారీచేసింది. నిరసనకారులో మాట్లాడటానికి సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, అడ్వకేట్ సద్నా రామచంద్రా మధ్యవర్తిగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు కోరింది. అయితే తనతోపాటు మాజీ సుప్రీంకోర్టు జడ్జీ కురియన్ జోసెఫ్ కూడా ఉండాలని సంయజ్ హెగ్డే సుప్రీంకోర్టును కోరారు.

English summary
Supreme Court on Monday told Shaheen Bagh protesters to come to a "reasonable solution" so that roads are no longer blocked
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X