వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్తారింటికి వెళ్లాడు: కండోమ్ లేదన్నారు, అందుకే జనాభా పెరిగిపోతుందని ధర్నా, రచ్చ!

ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం కారణంగా దేశ జనాభా పెరిగిపోతోంది, ఉచిత కండోమ్ సరఫరా బాక్స్ ఎందుకు ఇక్కడ పెట్టలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నానా హంగామా చేశాడు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్షం కారణంగా దేశ జనాభా పెరిగిపోతోంది, ఉచిత కండోమ్ సరఫరా బాక్స్ ఎందుకు ఇక్కడ పెట్టలేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నానా హంగామా చేశాడు. కండోమ్ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని వైద్యులను హెచ్చరించాడు.

కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా తరికేరికి చెందిన గణేష్ అనే వ్యక్తి తుమకూరు జిల్లా తిపటూరు తాలుకా మడేనహళ్ళిలో వివాహం చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం ఇతను భార్యతో కలిసి అత్తారింటికి వచ్చాడు. మంగళవారం రాత్రి గణేష్ తిపటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వెళ్లాడు.

కండోమ్ ఇవ్వండి

కండోమ్ ఇవ్వండి

తిపటూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిని కలిసి తనకు కండోమ్ కావాలని గణేష్ చెప్పాడు. ఆసుపత్రిలో కండోమ్ లేదని సిబ్బంది చెప్పారు. అంతే గణేష్ రెచ్చిపోయాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో కండోమ్ లేకపోవడం ఏమిటి ? అని ప్రశ్నించాడు. అసలు కండోమ్ బాక్స్ ఎందుకు ఏర్పాటు చెయ్యలేదని వారిని నిలదీశాడు.

Recommended Video

Why newly married couples are separated in Ashada masam
మీలాంటి వారు ఉద్యోగాలు చేస్తే ?

మీలాంటి వారు ఉద్యోగాలు చేస్తే ?

నానా హంగామా చేస్తూ వెంటనే తనకు కండోమ్ తీసుకు వచ్చి ఇవ్వాలని గణేష్ డిమాండ్ చేశాడు. మీలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే దేశ జనాభా పెరిగిపోతుందని, వెంటనే మీరు రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాడు. ఆసుపత్రి వైపు వచ్చిన వారు ఏమీ జరిగింది ? అంటూ ఆరా తీశారు.

నవ్వుకున్నా పట్టించుకోలేదు

నవ్వుకున్నా పట్టించుకోలేదు

కండోమ్ ఇవ్వలేదని గొడవ చేస్తున్నాడని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఇది ఎక్కడి చోద్యంరా దేవుడా, కండోమ్ ఇవ్వకుంటే ఇంత రచ్చ చెయ్యాలా ? అంటూ కొందరు నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లి పోయారు. అయితే గణేష్ మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యలేదు.

నేను మోనార్క్ అంటూ ధర్నా

నేను మోనార్క్ అంటూ ధర్నా

తిపటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఒక్కడే కుర్చుని ధర్నా చేశాడు. కండోమ్ బాక్స్ ఇక్కడే పెట్టామని, ఎవ్వరో దానిని ఎత్తుకుని వెళ్లారని ఆసుపత్రి సిబ్బంది గణేష్ కు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు అయితే నేను మోనార్క్ ఎవ్వరి మాట వినను అంటూ గణేష్ ధర్నా చేశాడు.

సింగల్ హ్యాండ్ గణేష్

సింగల్ హ్యాండ్ గణేష్

ఇక ఇతను ఎవ్వరి మాట వినడు అని తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఓ మెడికల్ షాప్ కు వెళ్లి ఓ బాక్స్ కండోమ్ లు తీసుకు వచ్చి గణేష్ కు ఇవ్వడంతో అతను ధర్నా విరమించాడు. కండోమ్ బాక్స్ మీడియాకు చూపిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

గణేష్ తో పెట్టుకున్నారు, డబ్బా కండోమ్స్ !

గణేష్ తో పెట్టుకున్నారు, డబ్బా కండోమ్స్ !

గణేష్ చేసిన దాంట్లో తప్పు ఏమీ లేదని కొందరు అంటున్నారు. హెచ్ఐవీ వ్యాది సోకకుండా ఉండాలన్నా, సంతానరహిత సంసారం చెయ్యాలన్నా కండోమ్ తప్పని సరి అంటూ వారు గుర్తు చేశారు. మొత్తం మీద కండోమ్ కోసం ఒక్కడే ధర్నా చేసిన గణేష్ ప్రస్తుతం కర్ణాటకలో వార్తల్లో నిలిచాడు.

English summary
Ganesh- Basically from Tarikere, Chikkamagalur district protest in front of Tiptur government hospital for not getting condom. He came to wife's house. Asked condom in hospital many times. But he did not get. So, he protest against hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X