వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ మంట: రైల్వేస్టేషన్ కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు: రైలు అద్దాలు ధ్వంసం..!

|
Google Oneindia TeluguNews

కోల్ కత: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగుతున్న ఆందోళనకారుల ఆగ్రహ జ్వాలలు.. క్రమంగా పొరుగు రాష్ట్రాలకు వ్యాపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళన.. పశ్చిమ బెంగాల్ కు పాకింది. పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు చెలరేగిపోయారు. శుక్రవారం సాయంత్రం ఏకంగా ఓ రైల్వే స్టేషన్ కే నిప్పులు పెట్టేశారు. రైళ్ల అద్దాలను ధ్వంసం చేశారు.

పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ జిల్లా బెల్డాంగ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సాయంత్రం పెద్ద ఎత్తున గుంపులు, గంపులుగా బెల్డాంగ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. కర్రలు, ఇనుప కడ్డీలతో వారు చెలరేగిపోయారు. స్టేషన్ లో లూప్ లైన్ లో నిలిపి ఉంచిన రైలు అద్దాలను ధ్వంసం చేశారు. రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై ఉన్న సామాన్లపై పెట్రోల్ పోసి, నిప్పు అంటించారు.

Protesters of Citizenship Amendment Act was A railway Station set on fire in West Bengal

పౌరసత్వ సవరణ చట్టాన్ని పశ్చిమ బెంగాల్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే. పైగా- అగ్నిగుండంలా మారిన అస్సాం రాష్ట్రానికి ఆనుకుని ఉండటంతో హింసాత్మక పరిస్థితులు, అల్లర్ల వాతావరణం పశ్చిమ బెంగాల్ కు పాకింది. ఆందోళనకారులు ఆస్తుల విధ్వంసానికి దిగారనే సమాచారాన్ని అందుకున్న వెంటనే రైల్వే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆందోళనకారులను చెదర గొట్టాయి. ఈ సందర్భంగా వారు రాళ్లు రువ్వడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Protesters of Citizenship Amendment Act was A railway Station set on fire in West Bengal
English summary
A railway station complex in West Bengal's Murshidabad district was set on fire on Friday evening by thousands of people protesting against the Citizenship (Amendment) Act. The protesters also thrashed personnel of the Railway Police Force that were at the Beldanga railway station complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X