వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోంలో నిరసనలు... ఏజీపీ, బీజేపీ కార్యాలయాలకు నిప్పు... మరో 48 గంటలు ఇంటర్‌నెట్ బంద్

|
Google Oneindia TeluguNews

అసోంలో రెండు రోజులుగా కోనసాగుతున్ని నిరసన జ్వాలలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చి పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసన కారులు ఏకంగా బీజేపీ కార్యాలయంతో పాటు అసోం గణపరిషత్ పార్టీ కార్యాలయాలకు నిప్పుపెట్టారు. మరోవైపు అసోం సీఎం శర్వానంద సోనోవాల్ ఇంటిపై కూడ దాడులు నిర్వహించారు. దీంతో మరో 48 గంటల పాటు ఇంటర్ నేట్ సేవలను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుపై అసోంలో నిరసనలు మిన్నంటాయి. బిల్లును వ్యతిరేకిస్తూ.. ప్రజలు రోడ్లపైకి వచ్చి అందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కర్ఫూ విధించినా.. లెక్క చేయని ప్రజలు పలు వాహానాలతోపాటు రైల్వే స్టేషన్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు సైతం నిప్పు పెట్టారు.

Protesters torch BJP, Asom Gana Parishad offices

ఇక బిల్లుకు ప్రధాన కారణమైన అధికార పార్టీ సీఎం ఇంటితో పాటు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల ఇంటిపై రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని లక్ష్మిపూర్‌ జిల్లాతో పాటు మరో జిల్లాలో బీజేపీ తో పాటు అసోం గణపరిషత్ కార్యాలయాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు.

మరోవైపు కేంద్రం మీడియాపై కూడ అంక్షలు విధించింది. నిరసన కారులు చేస్తున్న ఆందోళనలపై అంత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర సమాచార శాఖ పలు మీడియా సంస్థలను కోరింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. దేశ వ్యతిరేక వైఖరిని ప్రోత్సహించే అంశాలను ప్రసారం చేయకూడదని , ఇలాంటీ సమయంలో జగ్రత్తాగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

English summary
Protesters torch BJP, Asom Gana Parishad offices of Dhakuakhana, Lakhimpur district in assam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X