వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ మొండి వైఖరి -రైతుల ఆందోళన తీవ్రం -18న దేశవ్యాప్త రైల్‌ రోకో -ఆపై 40లక్షల ట్రాక్టర్లతో..

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ రంగంలో సంస్కరణ పేరుతో కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ.. దేశ రాజధాని ఢిల్లీ శివారుల్లో వేలాది మంది రైతులు కొనసాగిస్తోన్న నిరసనలు బుధవారంతో 77 రోజులు పూర్తయ్యాయి. రిపబ్లిక్ డే నాటి హింస తర్వాత రైతు సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చల ప్రక్రియ కూడా నిలిచిపోయింది. ఓవైపు రైతుల్ని చర్చలకు ఆహ్వానించిన ప్రధాని మోదీ.. గడిచిన వారం మూడు రోజులుగా పార్లమెంటులో వరుస ప్రసంగాలు చేస్తూ రైతుల ఉద్యమంపై, దాని సమర్థకులపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ దశలో..

మోదీ మళ్లీ అనేశారు -లోక్‌సభలో క్లారిటీ ప్రసంగం -ఆందోళనకారులు, ఆందోళన జీవులు వేరన్న ప్రధానిమోదీ మళ్లీ అనేశారు -లోక్‌సభలో క్లారిటీ ప్రసంగం -ఆందోళనకారులు, ఆందోళన జీవులు వేరన్న ప్రధాని

సాగు చట్టాలపై కేంద్రం అంతకంతకూ మొండివైఖరి ప్రదర్శిస్తుండటంతో రైతులు తమ ఉద్యమాన్ని ఇంకాస్త తీవ్రతరం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళన వచ్చే వారంలో మరింత ఉధృతం కానుంది. ఫిబ్రవరి 18న దేశవ్యాప్తంగా 4 గంటల పాటు రైల్‌రోకో‌కు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) బుధవారంనాడు పిలుపునిచ్చింది. ఆ రోజు..

Protesting farmers announce 4-hour nationwide rail roko on February 18

దేశవ్యాప్తంగా రైల్ రోకో చేపట్టనున్న ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటలు వరకూ రైల్‌రోకో నిర్వహించనున్నట్టు రైతు ఆందోళనకు సారధ్యం వహిస్తున్న ఎస్‌కేఎం ఒక ప్రకటనలో తెలిపింది. ఆందోళన జరుపుతున్న రైతులు చర్చలు ప్రారంభించాలంటూ ప్రధాని మోదీ లోక్‌సభలో బుధవారంనాడు రెండోసారి విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలకే ఎస్‌కేఎం ఈ పిలుపునివ్వడం గమనార్హం. కాగా,

అడ్డంగా దొరికిన జగన్ -పోస్కోతో డీల్ బయటపెట్టిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ ఫైర్అడ్డంగా దొరికిన జగన్ -పోస్కోతో డీల్ బయటపెట్టిన కేంద్రం -విశాఖ స్టీల్ ప్లాంట్‌పై టీడీపీ ఫైర్

40 లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తామని, రైతుల ఉద్యమాన్ని దేశ వ్యాపితం చేస్తామని రైతు సంఘాల నేత టికాయత్ హెచ్చరించగా, దేశ వ్యాప్త ఆందోళన అక్టోబర్ 2 వరకు కొనసాగుతుందని, చట్టాల ఉపసంహరణకు అక్టోబర్ 2వ తేదీ వరకూ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నట్టు సంయుక్తంగా మరో ప్రకటన వెలువడింది. ఆ గడువులోగా చట్టాలు రద్దు చేయకుండే తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని రైతు సంఘాలు హెచ్చరించాయి.

English summary
After resorting to road blockade, the protesting farmers have now announced a four-hour nationwide 'rail-roko' (railway blockade) on February 18. Earlier this month, the agitators had observed a three-hour road blockade to press their demand of repealing the three laws. Thousands of farmers have been protesting against the three laws which were enacted in September last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X