వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిన్నంటిన నిరసనలు.. చట్టం రద్దుకు రైతుల పట్టు, క్లాజులవారీగా చర్చలకు ప్రభుత్వం ఓకే..

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతోంది. డిమాండ్లపై వారు వెనక్కి తగ్గడం లేదు. ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టువిడుపు ధోరణి అవలంభించడం లేదు. దీంతో ఆందోళన పర్వం కంటిన్యూ అవుతూనే ఉంది. సోమవారం కూడా రైతు నేతల నిరసన సెగ మిన్నంటించింది. సోమవారం 19వ రోజు వివిధ చోట్ల నిరసనలు మిన్నంటాయి. కొత్త చట్టాలను రద్దు చేయకుంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు.

Recommended Video

#farmlaws: Farmers’ Dharna continue at Delhi border areas
 Protesting farmers sit on day-long hunger strike

రైతు నేతలతో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది అని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించి క్లాజులవారీగా కూడా చర్చించేందుకు సిద్దం అని ఆయన ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించి రైతు నేతలకు లిఖితపూర్వకంగా రాసి పంపామని.. వారి ప్రతిస్పందన కోసం చూస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం చేసిన మూడు చట్టాలు రైతుల మేలు కోసం ఆలోచించి చేసినవి అని ఉద్ఘాటించారు.

దీనిపై విపక్షాలు మాత్రం గుర్రు మీదున్నాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి.. ఆమెదింపజేసి తేనేతుట్టేను కదిపాయని వారు అంటున్నారు. రైతుల ఆందోళనతో టోల్ ప్లాజాలకు తీవ్ర నష్టం జరుగుతోందని తెలిపారు. రోజుకు రూ.3 కోట్ల ఆదాయం కోల్పోతుందని చెప్పారు. దీనికి సంబంధించి చర్చలు జరిపి.. పరిష్కరించుకోవాలని సూచించారు.

English summary
Farmers protesting against the Centre's three new farm laws staged a hunger strike at various protest sites as the agitation entered day-19.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X