హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు : హైదరాబాద్ మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో నిరసనలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(Manuu) సోమవారం రాత్రి బీజేపీ వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. ఢిల్లీలోని మౌజ్‌పూర్,జాఫ్రాబాద్‌లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలను నిరసిస్తూ.. వందలాది విద్యార్థులు క్యాంపస్‌లో మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'మోదీ నీ నియంతృత్వం పనిచేయదు' అంటూ నినాదాలు చేశారు. ఢిల్లీలో హింసాత్మక ఘటనలకు ఢిల్లీ పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు.

సీఏఏ ఆందోళనకారులకు,సీఏఏ మద్దతుదారులకు మధ్య ఘర్షణను ఖండిస్తున్నామని చెప్పారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలను నెలకొల్పడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని.. దానివల్ల అమాయక ప్రజలు ప్రాణాలు యూనివర్సిటీ యూనియయన్ ప్రెసిడెంట్ ఉమర్ ఫరూఖ్ అన్నారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ఇస్లామోఫోబియాతో బాధపడుతోందని.. అందుకే దేశ సెక్యులరిజాన్ని దెబ్బతీసే చట్టాలను తీసుకొస్తోందని విమర్శించారు.

protests start at maulana azad university in hyderabad after delhi violence

కాగా,ఢిల్లీలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. మరో 50 మంది గాయపడ్డారు. మొదట నిరసనకారులు స్థానిక ఇళ్లను తగలబెట్టడంతో ఇరువర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు కూడా గాయపడ్డారు. ఈ పరిణామాలపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఢిల్లీలో శాంతియుత వాతావ‌ర‌ణం లేద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నగరంలో తిరిగి శాంతి నెల‌కొనేలా భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రిని కోరారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ఢిల్లీ ప్రజలు శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు.

English summary
The Maulana Azad National Urdu University (Manuu) campus at Gachibowli on Monday night reverberated with slogans like “BJP Murdabad” and odi your dictatorship will not work as hundreds of students marched in protest against Delhi’s Maujpur and Jaffarabad violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X