వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌హోస్టెస్‌ను కాపాడిన భారత వైద్యురాలు: పొంగిపోయిన భర్త ఏం చేశాడంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/కౌలాలంపూర్‌: భూమికి వేల అడుగుల ఎత్తులో విమానం ప్రయాణిస్తుండగా... ఆ విమానంలోని ఎయిర్‌హోస్టెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆ విమానంలోనే ఉన్న ఓ భారతీయ వైద్యురాలు స్పందించి ఆమెకు కావాల్సిన ప్రాథమిక చికిత్సను అందించింది. దీంతో ఆ ఎయిర్ హోస్టెస్ ఆరోగ్యం నిలకడగా మారింది. ఈ ఘటన న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌ వెళ్తున్న మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో చోటుచేసుకుంది.

కాగా, వైద్యురాలైన తన భార్య చేసిన ఈ పనికి.. ఆమె భర్త పొంగిపోయాడు. తన ఈ ఆనందాన్ని పంచుకునేందుకు ఫేస్‌బుక్‌ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. గాలిలో ప్రయాణిస్తున్న విమానంలో ఉన్నట్టుండి ఓ ఎయిర్‌హోస్టెస్‌ స్పృహ తప్పి పడిపోయింది. ఆమెకు అత్యవసర వైద్య సహాయం కావాల్సి వచ్చింది. దీంతో విమాన సిబ్బంది ప్రయాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా?.. దయచేసి సహాయం చేయండని కోరారు. దీంతో విమానంలోని భారతీయ వైద్యురాలు డాక్టర్‌ అంచిత స్పందించారు.

వెంటనే విమాన సిబ్బంది.. అంచితకు మెడికల్‌ కిట్‌ తెచ్చి ఇచ్చారు. దీంతో ఆమె ఎయిర్‌హోస్టెస్‌కు ప్రాథమిక వైద్యం అందించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన గురించి అంచిత భర్త సౌరవ్ కుమార్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో వెలుగుచూసింది. అత్యవసర వైద్య సాయం కావాలని కోరగా.. స్పందించిన ఏకైక వ్యక్తి నా భార్య అని, తన పట్ల నేను చాలా గర్వపడుతున్నానని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.

ఒకవేళ అంచిత వైద్య చికిత్సకు ఎయిర్‌హోస్టెస్‌ స్పందించకపోతే ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేయడానికి పైలట్‌ సిద్ధమయ్యారని.. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఆస్ట్రేలియాకు వెళ్లాలంటే రెండు గంటలు, తిరిగి ఆక్లాండ్‌కు వెళ్లాలంటే గంట సమయం పట్టేలా ఉంది. అదృష్టవశాత్తు అంచిత చికిత్సకు ఎయిర్‌హోస్టెస్‌ వెంటనే స్పందించి నెమ్మదిగా కళ్లు తెరిచిందని చెప్పారు. దీంతో విమాన ప్రయాణికులంతా సంతోషంతో చప్పట్లు కొట్టి తన భార్యను అభినందించారని గర్వంగా చెప్పుకొచ్చారు.

అంతేగాక, విమాన పైలట్‌ తమ సీటు వద్దకు వచ్చి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. దీంతో తనకు చాలా ఆనందంగా, గర్వంగా అనిపించిందని తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు అంచిత భర్త కుమార్. ఏదేమైనా.. ఈ భారత వైద్యురాలు చేసిన పనిని అందరూ మెచ్చుకోవాల్సిందే.

English summary
Saurabh Kumar, who works in the ministry of finance, Delhi, is a proud husband. His wife, Anchita Pandoh, a physician by profession, recently helped a patient to revive consciousness mid-air, as the couple and other co-passengers were flying in the Malaysia Airlines flight MH 130 from Auckland, New Zealand to Kuala Lumpur, Malaysia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X