వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మ అడుగుజాడల్లో నడవడం గర్వంగా ఉంది : జై శంకర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి పదవీ చేపట్టిన సుబ్రమణ్యం జై శంకర్ .. మాజీ మంత్రి సుష్మ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఫస్ట్ టైం ట్వీట్ చేశారు. తనకు సుష్మపై ఎనలేని గౌరవం ఉందని స్పష్టంచేశారు.

కీలక శాఖ ...
మోడీ 2.0లో జై శంకర్ కు కీలకశాఖ దక్కింది. విదేశాంగ శాఖ మంత్రి పదవీ కట్టబెట్టారు. ఈ క్రమంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. తనపై ఇంత పెద్ద భారం ఉంచిన మోడీ ధన్యవాదాలు తెలిపారు. తనపై అభిమానం చూసి అభినందనలు తెలిపిన వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. సుష్మ స్వరాజ్ అడుగు జాడల్లో నడవడం తనకు గర్వంగా ఉందన్నారు. మోడీ తొలి క్యాబినెట్ లో సుష్మ .. విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రవాసీల కోసం విశేషంగా పనిచేయడంతో ఆమెను అందరూ అమ్మ అని పిలుస్తారు. అయితే అనారోగ్య సమస్యలతో ఆమె మళ్లీ క్యాబినెట్ లో చేరలేదు. దీంతో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసి రిటైరైన జై శంకర్ కు ప్రమోషన్ వచ్చింది. ఏకంగా క్యాబినెట్ పోర్టు పోలియో దక్కింది. అయితే ఆ పదవీ ఆయన సమర్థతకు నిదర్శనం అనే వారు ఉన్నారు.

Proud to follow in Sushma Swarajs footsteps: S Jaishankar

ఫస్ట్ పర్సన్
1977 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెంది జై శంకర్ కు మంచి బ్యూరోక్రాట్ గా గుర్తింపు ఉంది. మోడీ హయాంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా విశేష సేవలు అందించారు జై శంకర్. కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టిన జై శంకర్ ... విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఘనస్వాగతం పలికారు. విదేశాల్లో భారతదేశ సంబంధాలు మరింత మెరుగుపరచడంపై మోడీ దృష్టిసారించారు. ఆ నేపథ్యంలోనే సమర్ధుడైన జై శంకర్ కు పదవీ కట్టబెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

విదేశాంగ శాఖ కార్యదర్శి పనిచేసి .. విదేశాంగ మంత్రిగా పనిచేస్తోన్న మొదటి వ్యక్తిగా జై శంకర్ రికార్డు స‌‌ృష్టించారు. ఇదివరకు నట్వర్ సింగ్ కూడా ఐఎఫ్ ఎస్ చేసి 1980లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత 2004 నుంచి 2005 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ పదవీ నుంచి రిటైరై .. విధులు నిర్వర్తిస్తున్న తొలి వ్యక్తి మాత్రం జై శంకర్ కావడం విశేషం.

English summary
After taking charge as the new External Affairs Minister, former foreign secretary Jaishankar said he was proud to follow in the footsteps of Sushma Swaraj. In his first tweet after assuming charge, S Jaishankar thanked everyone for their good wishes and said he was honoured to be given the responsibility. "My first tweet. Thank you all for the best wishes! Honoured to be given this responsibility. Proud to follow on the footsteps of SushmaSwaraj ji," tweeted S Jaishankar on Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X