వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ ఏం చదువుకున్నారు?: కేజ్రీవాల్ లేఖ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు ఏంటో తెలుసా? ఆ వివరాలు బహిర్గతం చేయాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే డిమాండ్ ఆర్టీఐ దరఖాస్తుగా మారింది. ప్రధాని మోడీ మోడీ చదువు వివరాలు కావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఉన్న ఇన్ఫర్మేషన్ కమీషనర్ ఎం.శ్రీధర్ ఆచార్యులకు ఇటీవల లేఖ రాశారు.

ఈ నేపథ్యంలో సమాచార కమిషన్ ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు, ఆయన చదివిన కళాశాలల వివరాలను సేకరించే పనిలో పడింది. 2014 ఎన్నికల సమయంలో అఫిడవిట్‌లో మోడీ పేర్కొన్న దాని ప్రకారం, బీఏ, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఢిల్లీ, గుజరాత్ వర్శిటీల్లో మోడీ చదువుకున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.

దీంతో ఆయా వర్శీటీల్లో మోడీ క్రమసంఖ్య వివరాలు కావాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ)ను సమాచార శాఖ కోరినట్లు సమాచారం. అయితే ప్రధాని విద్యార్హతలను కప్పిపుచ్చుతున్నట్లు కేజ్రీవాల్ తన లేఖలో ఆరోపించారు. ప్రధాని మోడీ విద్యార్హతలు తెలుపాలంటూ ఇటీవల కూడా ఓ దరఖాస్తుదారుడు ఆర్టీఐలో దారఖాస్తు చేశారు.

అయితే, ఈ పిటిషన్‌పై సదరు శాఖ స్పందించలేదు. ఇప్పుడు, ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్న ఒక వ్యక్తి ఇదే విషయమై ప్రశ్నించడంతో సమాచార కమిషన్ స్పందించవింది. బీజేపీపై విరుచుకపడటంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ది ప్రత్యేక శైలి. తాజాగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభుపై ఆయన ప్రశంసలు కురిపించారు.

కేజ్రీవాల్ తాజాగా ఓ ట్వీట్‌లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభును ఎంతో మెచ్చుకున్నారు. ఆయనను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని కరువు పీడిత ప్రాంతం లాతూరుకు 3 కోట్ల 20 లక్షల లీటర్ల నీటిని రైళ్ళ ద్వారా పంపించడం అత్యంత అద్భుతమైన కార్యక్రమమని ప్రశంసించారు. 11 సార్లు రైళ్ళు వెళ్ళి నీటిని అందజేయడం చాలా బాగుందన్నారు.

English summary
The Central Information Commission (CIC) Friday directed Delhi University and Gujarat University to search and provide information on Prime Minister Narendra Modi’s degrees to Delhi Chief Minister Arvind Kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X