వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పబ్జీ మొబైల్, లైట్ అభిమానులకు చేదువార్త: ఇక నుంచి ఆటల్లేవు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇది పబ్లీ అభిమానులకు మరో చేదు వార్తే. ఇక నుంచి ఈ ఆటను మనదేశంలో ఎవరూ ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్లీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న పబ్జీ యూజర్లకు ఇక నుంచి ఈ ఆట ఆడే అవకాశం ఉండదు.

భారత ప్రభుత్వం నిషేధం విధించిన దాదాపు రెండు నెలల తర్వాత పబ్జీ తన సేవలను పూర్తిగా నిలిపివేయడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పబ్జీ సహా 116 చైనా మొబైల్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో సెప్టెంబర్ 2 నుంచి పబ్జీ కొత్త డౌన్‌‌లోడ్లు నిలిచిపోయాయి.

PUBG Mobile, Lite version stop working in India from Friday

కానీ, నిషేధానికి ముందే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నవారికి మాత్రం ఇన్నాళ్లు గేమ్ ఆడే అవకాశం లభించింది. తాజాగా, సర్వర్లను నిలిపివేయడంతో ఇకపై వారు కూడా పబ్జీ గేమ్ ఆడలేరు. యాప్ ఇక పనిచేయదు. ఈ మేరకు పబ్జీ మొబైల్ ఫేస్‌బుక్ ఖాతా ద్వారా వెల్లడించింది.

యూజర్ల డేటా భద్రతకు తాము అధిక ప్రాధాన్యత ఇస్తామని, భారత డేటా భద్రత చట్టాలను నిబంధనలను ఎల్లప్పుడూ పాటించామని పబ్జీ మొబైల్ వివరణ ఇచ్చింది.
ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల మేరకు అక్టోబర్ 30 నుంచి భారత యూజర్లకు పబ్జీ మొబైల్ నోర్డిక్ మ్యప్, లివిక్, పబ్జీ మొబైల్ లైట్ సేవలను టెన్సెంట్ గేమ్స్ నిలిపివేసింది.

ఇక పబ్జీ అభిమానులు చూపిన ఆదరణకు ఆ కంపెనీ ధన్యవాదాలు తెలిపింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా 600 మిలియన్ డౌన్‌లోడ్స్, 50 మిలియన్ల యాక్టివ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక భారతదేశంలో 33 మిలియన్ల యూజర్లు ఉండేవారు.

English summary
PUBG Mobile and PUBG Mobile Lite will no longer work for gamers in India starting from Friday, the company has announced.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X