• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పబ్జీ 6 గంటలే ఆడే నిబంధన తొలగింపు ... హెల్త్ రిమైండర్ ఎర్రర్ అట.. షాకింగ్ ట్వీట్

|

పబ్జీగేమ్ ఇక నుండి ఆరుగంటలే ఆడేలా పరిమితం చేస్తూ పబ్జీవాలాలకు షాక్ ఇచ్చింది టెన్ సెంట్ గేమింగ్ కంపెనీ అని అందరూ భావించారు. ఇది పేరెంట్స్ కు గుడ్ న్యూస్ అని సంబరపడ్డారు. పబ్జీ వల్ల పెరుగుతున్న మరణాల నేపధ్యంలో ఈ గేమ్ పై భారత ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఈ తరహా నిర్ణయం తీసుకుందని , ఇది కాస్త ఊరట అని భావించిన తల్లిదండ్రులకు పబ్జీ షాక్ ఇచ్చింది. టెన్ సెంట్ గేమింగ్ కంపెనీ పబ్జీ ని ఏ టైం అయినా, ఎంత సేపైనా ఆడుకోవచ్చు అని ప్రకటించి సెన్సేషన్ సృష్టించింది. హెల్త్ రిమైండర్ కేవలం ఒక ఎర్రర్ అని కొట్టిపారేసిన కంపెనీ ఆడుకున్నోళ్ళకు ఆడుకున్నంత అని ప్రకటించటం నిజంగా షాకే .

పబ్జీగేమ్ ఇక నుండి ఆరుగంటలే .. పబ్జీవాలాలకు షాక్ .. పేరెంట్స్ కు గుడ్ న్యూస్

ఇండియా లో కేవలం ఆరుగంటలే పబ్జీ ఆడే అవకాశం మొదట వెలువడిన ప్రకటన

ఇండియా లో కేవలం ఆరుగంటలే పబ్జీ ఆడే అవకాశం మొదట వెలువడిన ప్రకటన

ఆరు గంటలు మించి పబ్‌జీ ఆడలేరు. ఇండియాలో కేవలం ఆరు గంటలు మాత్రమే పబ్జీ ఆడేందుకు అనుమతి లభించింది.ఎవరైనా రోజుకు 6 గంటలు పబ్జీ ఆడగానే తాత్కాలికంగా బ్లాక్‌ అవుతుంది. మళ్లీ మరుసటి రోజు వరకు ఇక పబ్జీ ఆడే అవకాశం లేకుండా చేసింది ఆ గేమింగ్ కంపెనీ . పబ్జీ 6 గంటలు ఆడగానే హెల్త్‌ రిమైండర్‌ రావడంపై అధికారికంగా ఎలాంటి స్టేట్‌మెంట్‌ విడుదల కాలేదు కానీ... ప్లేయర్స్‌ మొబైల్‌పై హెల్త్‌ రిమైండర్‌ పేరుతో నోటిఫికేషన్‌ కనిపిస్తోంది.

ఆరుగంటలకే ఆట పరిమితం కావటంతో ఫైర్ అవుతున్న ప్లేయర్లు

ఆరుగంటలకే ఆట పరిమితం కావటంతో ఫైర్ అవుతున్న ప్లేయర్లు

ఇక ఇండియాలో పబ్ జీ గేమ్ ఆడుతున్నవారు గేమ్ ఆడుతుండగా... ఆరు గంటలు కాగానే సడెన్‌గా గేమ్ క్లోజ్ అవుతోంది. లేదంటే హెల్త్ రిమైండర్ పాప్ అప్స్ వస్తున్నాయి . దీంతో ఇంతకు మించి ఎక్కువ సేపు గేమ్ ఆడితే హెల్త్‌కే ప్రమాదం అని అవి సూచిస్తున్నాయి . ఇక ఈ హెల్త్ రిమైండర్ పాప్అప్స్ పై గేమర్లు మండిపడ్డారు. మా హెల్త్ సంగతి మాకు తెలుసు కానీ మీకెందుకు మా హెల్త్ పై అంత శ్రద్ధ అని ఫైర్ అవుతున్నారు. గేమ్ రూల్స్ ప్రకారం గేమ్ ఉండాల్సిందే అంటూ సదరు గేమింగ్ కంపెనీపై ఒత్తిడి తెస్తున్నారు.

హెల్త్ రిమైండర్ పాప్అప్స్ ఒక ఎర్రర్ అని .. ఆంక్షలు తీసేసిన పబ్జీ

హెల్త్ రిమైండర్ పాప్అప్స్ ఒక ఎర్రర్ అని .. ఆంక్షలు తీసేసిన పబ్జీ

ఇండియాలో కొన్ని కోట్ల మంది పబ్ జీ ఆడుతున్నారు. ఇలాంటి ఆంక్షలు పెట్టడమన్నది గేమ్ రూల్స్‌కి విరుద్దమని వారు రివర్స్ అవుతున్నారు. ఈ సమస్యను పరిశీలించిన మేనేజ్‌మెంట్... కంటిన్యూగా గేమ్ ఆడటం ప్రమాదమన్న మంచి ఉద్దేశంతోనే ఈ రూల్ తెచ్చామనీ, ఇప్పుడు అది తీసేశామనీ వివరిస్తూ... ట్విట్టర్‌లో క్షమాపణ చెప్పింది. హెల్త్ రిమైండర్ పాప్అప్స్ ఎర్రర్ అని తేల్చేసింది.

పబ్జీ మొబైల్ ఇండియా పేరుతో ఉన్న ట్విట్టర్ లో పోస్ట్

పబ్జీ మొబైల్ ఇండియా పేరుతో ఉన్న ట్విట్టర్ లో పోస్ట్

"డియర్ ప్లేయర్స్. కమ్యూనిటీ నుంచీ వచ్చిన ఫీడ్‌బ్యాక్ పరిశీలించి, ఇప్పుడు మేం బర్త్‌డే క్రాట్‌ను మార్చేశాం. ది హెల్తీ గేమ్ ప్లే సిస్టం ఎర్రర్ కూడా సరిచేశాం. ఇప్పుడు మీరు గ్యాప్ లేకుండా ఆడుకోవచ్చు. పేమెంట్ సిస్టమ్స్ బ్యాకప్ ఉంటుంది. జరిగిన పొరపాటుకు క్షమాపణ తెలుపుతున్నాం".అంటూ పబ్జీ మొబైల్ ఇండియా చేసిన పోస్ట్ తో పబ్జీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఇక 24 గంటలు ఎప్పుడైనా ఆడుకోవచ్చు అని చేసిన ప్రకటనతో ప్లేయర్లు జోష్ లో ఉంటే పేరెంట్స్ మాత్రం పరేషాన్ అవుతున్నారు.

English summary
PUBG Mobile recently rolled out a health safety warning feature for its Indian users, that locked players out of the game for 24 hours after six hours of gameplay. However, the warning has now been removed with the company claiming it was a ‘system error’.The feature was rolled out to Indian players with the latest anniversary update.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X