వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాటి కంటే దారుణం..: యువత గుర్రు, మోడీకి పెద్ద సవాలే

నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరుగుతోందని యువత ఆగ్రహంతో ఉందని ఓ సర్వేలో తేలింది. పెరుగుతున్న నిరుద్యోగం మోడీ ప్రభుత్వానికి ఓ పెద్ద సవాల్‌గా మారింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నిరుద్యోగం పెరుగుతోందని యువత ఆగ్రహంతో ఉందని ఓ సర్వేలో తేలింది. పెరుగుతున్న నిరుద్యోగం మోడీ ప్రభుత్వానికి ఓ పెద్ద సవాల్‌గా మారింది.

న్యూఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ సొసైటీస్ (సిఎస్‌డిఎస్) సర్వేలో ఉద్యోగాల విషయంలో ఎన్డీయే ప్రభుత్వంపై అసంతృప్తి నెలకొన్నట్లుగా తేలింది.

Public anger over growing unemployment a big challenge for Modi government

మూడ్ ఆఫ్ నేషన్ పేరిట 19 రాష్ట్రాలలో 11,000 మందితో ఈ సర్వే చేశారు. ఈ సర్వేను ఈ ఏడాది మే నెలలో చేశారు. నిరుద్యోగం పైన జనాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తేలింది.

దేశానికి నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని సర్వేలో పాల్గొన్న వారిలో నాలుగొంతుల మంది అభిప్రాయపడ్డారు.

రెండోసారి యూపీఏ ప్రభుత్వం (2009-2014) కంటే ఇప్పుడు నిరుద్యోగం ఇంకా ఎక్కువ ఉందని ఈ సర్వే ద్వారా వెల్లడైంది.

2013లో ఇలాగే సర్వే చేసినప్పుడు 29 శాతం మంది ఉద్యోగ అవకాశాలు గత రెండేళ్లలో పెరిగాయని అప్పుడు చెప్పారు. కానీ, 2013-2017 మధ్య ఉద్యోగాలు పెరుగుతున్నాయని చెప్పిన వారు 23 శాతంగా మాత్రమే ఉన్నారు. అంటే అప్పటి కంటే ఆరు శాతం తగ్గింది.

ముఖ్యంగా యువత నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని సర్వేలో తేలింది. 18-25 ఏళ్ల మధ్య ఉన్న యువతలో దాదాపు మూడోంతుల శాతం.. నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిని మొత్తంగా కలిపి చూస్తే మాత్రం 24 శాతం మంది ఉద్యోగ సమస్య బాగా ఉందని చెప్పారు.

నిరుద్యోగ సమస్య చాలా ఉందని 33 శాతం మంది కాలేజీ యువత పేర్కొంది. చదువుకోని యువతలో 23 శాతం మంది ఉద్యోగ సమస్య ఉందని చెప్పారు.

సర్వేలో పాల్గొన్న వారిలో ప్రతి పది మందిలో దాదాపు ముగ్గురు (29 శాతం మంది) నిరుద్యోగం పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. గ్రామాలు, మెట్రోపాలిటన్ సిటీలలో మాత్రం వరుసగా 22 శాతం, 23 శాతం మంది అన్ ఎంప్లాయ్‌మెంట్ సమస్యగా చెప్పారు. నగరాలు, టౌన్‌లలో 40 శాతం మంది చెప్పారు.

English summary
A CSDS survey shows that the public perception about job growth is worse than what it was during the second term of the UPA government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X