వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ 11 మంది మరణానికి కారణమేంటీ..? వైద్యారోగ్యశాఖకు నిపుణుల లేఖ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వచ్చిందనే ఉపశమనం మాత్రం కొంత ఉంది. అయితే టీకా తీసుకొని కొందరు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 11 మంది వరకు మృతిచెందారు. దీంతో వారి మరణానికి కారణం ఏంటో విచారణ జరపాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖకు లేఖ రాశారు.

టీకా తీసుకున్న 11 మందికి మరణానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలని కోరారు. అయితే ఆ 11 మంది మరణాల్లో జిల్లా/ రాష్ట్ర అధికారులు టీకా తీసుకోవడం వల్ల చనిపోలేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. వారి మరణానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిపి.. ప్రజలకు బహిర్గతం చేయాలని స్పష్టంచేశారు. దీనికి సంబంధించి పరిణామాలను జాతీయ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మలినీ ఐసోలా, ఎస్పీ కలాంట్రీ, టీ జాకోబ్ అనే తదితరులు లేఖ రాశారు.

Public health experts write to Health Ministry, demands probe into 11 deaths

11 మంది మరణాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ప్రమాణాల మేరకు దర్యాప్తు జరగాలని లేఖలో ప్రస్తావించారు. వ్యాక్సిన్ ఇచ్చేముందు తగిన జాగ్రత్తలు తీసుకున్నారా అని అడిగారు. టీకాను నిర్దేశిత ఉష్ణోగ్రతలో రిజర్వ్ చేశారా అని కొశ్చన్ చేశారు. టీకా వచ్చినప్పటీ నుంచి ఇచ్చే వరకు జరిగిన పరిణామాలపై క్లారిటీ కావాలని కోరారు. టీకా ఇచ్చినప్పటీ నుంచి శరీరంలో జరిగిన మార్పులను విపులంగా వివరించాలని విన్నవించారు. లేదంటే గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. మరీ దీనిపై వైద్యారోగ్యశాఖ ఏం సమాధానం చెబుతుందో చూడాలీ.

Recommended Video

#earthquake : Earth Tremors Reported In Kukatpally In Hyderabad

English summary
Public health experts sent a letter to the Union Health Ministry on Sunday, demanding an investigation into the deaths of 11 healthcare and frontline workers following vaccination.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X