ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులపై కఠిన చట్ట ప్రయోగం: కనీసం మూడు నెలల జైలు ఖాయం..!
శ్రీనగర్: ఇద్దరు మాజీ ము్ఖ్యమంత్రులపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠిన చట్టాన్ని ప్రయోగించినట్లు తెలుస్తోంది.. ఈ చట్టం ప్రకారం.. కనీసం మూడేళ్ల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. గరిష్ఠ శిక్షా కాలం రెండు సంవత్సరాలు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, నోటీసులను కూడా జారీ చేయకుండా.. వారిద్దరినీ అరెస్టు చేసే అధికారం పోలీసు యంత్రాంగానికి ఉంటుంది. అదే ప్రజా భద్రతా చట్టం (పబ్లిక్ సేఫ్టీ యాక్ట్-పీఎస్ఏ).

ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై..
తాజాగా ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీలపై ప్రయోగించినట్లు చెబుతున్నారు. ఆ ఇద్దరు నాయకులు ఉమ్మడి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారే. పైగా- సుమారు ఆరు నెలలుగా తమ నివాసాల్లో గృహ నిర్బంధంలో ఉంటున్నారు. ఈ సమాచారాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

పీఎస్ఏ ప్రయోగంపై భిన్న వాదనలు..
మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ సైతం ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై ప్రజా భద్రతా చట్టాన్ని ప్రయోగించినట్లు తనకు ఎలాంటి సమాచారం అందలేదని అన్నారు. అయినప్పటికీ- వారిద్దరినీ ప్రజా భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది.

పలువురు నేతలపై పీఎస్ఏ ప్రయోగం..
నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అలీ మహ్మద్ సగార్, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బషీర్ అహ్మద్ వీరి, సర్తాజ్ మడానిలపై ఈ చట్టం కింద అరెస్టు చేశారు. ఈ కారణంతోనే వారంతా గత ఏడాది ఆగస్టు నుంచి గృహ నిర్బంధంలో ఉంటున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపైనా ఇదే చట్టాన్ని ప్రయోగించారని, అందువల్లే ఆయనను గృహ నిర్బంధం నుంచి బాహ్యం ప్రపంచంలోకి విడుదల చేయట్లేదనే వార్తలు చాలాకాలం నుంచే వినిపిస్తున్నాయి.

ఆర్టికల్ 375ను ఎత్తేసిన తరువాత..
జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 375ను రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని విడగొట్టి.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పలువురు సీనియర్ నాయకులను కేంద్ర ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. వారిని బాహ్య ప్రపంచంలోకి వదిలి వేస్తే.. ప్రజలను రెచ్చగొట్టడం, రెచ్చిపోయేలా ప్రసంగాలు చేయడం, శాంతిభద్రతలకు భగ్నం కలిగించే కార్యక్రమాలకు పూనుకుంటారనే కారణంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.