వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్ధరాత్రి వేళ.. స్కూటర్ పై మహిళా గవర్నర్.. ఏం చేసిందంటే...

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నరు కిరణ్‌బేడి అర్ధరాత్రి వేళ స్కూటర్ పై బయటికెళ్లి పుదుచ్చేరి రోడ్లపై తిరుగుతూ మహిళా భద్రత గురించి పరిశీలించారు. తానెవరనేది తెలియకుండా కిరణ్ బేడీ తన ముఖానికి చున్నీ కప్పు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పూర్వం రాజులు తమ రాజ్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారు, వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అని తెలుసుకునేందుకు మారువేషాల్లో వెళ్లి రాజ్యమంతా తిరిగి పరిశీలించేవాళ్లని కథల్లో వినేవాళ్లం.

అయితే ఈ కాలంలోనూ ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఓ మహిళా గవర్నర్ అర్ధరాత్రి వేళ తానెవరనేది తెలియకుండా బయటికెళ్లి మహిళా భద్రత గురించి పరిశీలించారు.

kiran-bedi

ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. ఆమె మరెవరో కాదు.. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నరు కిరణ్‌బేడి. మహిళ భద్రతపై ఆరా తీసేందుకు ఆమె ఓ అజ్ఞాత వ్యక్తి మాదిరిగా వెళ్లి పరిశీలించారు. ద్విచక్రవాహనంపై వెళ్లి ప్రధాన రహదారుల్లో తిరిగారు.

ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కిరణ్ బేడీ తన ముఖానికి చున్నీ కప్పుకున్నారు. ఎటువంటి భద్రత లేకుండా అర్ధరాత్రి వేళ ఆమె ఎంతో ధైర్యంగా ద్విచక్రవాహనంపై పర్యటించారు. దీని గురించి ఆమే స్వయంగా ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

'పుదుచ్చేరిలో రాత్రివేళ బయట ఉండటం సురక్షితమే. కానీ భద్రతను మరింత మెరుగుపరుస్తాం..' అంటూ ట్వీట్ చేశారు. ప్రజలు తమకు ఏదైనా అవసరమైతే పీసీఆర్‌, 100కు ఫోన్‌ చేసి సహాయం తీసుకోవాల్సిందిగా ఆమె కోరారు.

English summary
Kiran Bedi, the Lt Governor of Puducherry said that the union territory is safe for women “even at night”. Bedi, however, suggested a few measures which the police need to take to enhance security. Her comment came after the round that she conducted of the Union territory at the night to confirm that it is safe for women. Bedi conducted a night round of the city not in a car but on the pillion of a scooter. Later she took to Twitter and said that she felt that Puducherry is safe for women even at night. “Just back from a night round. Went pillion riding on a scooter camouflaged. Felt Pondicherry safe for women, even at night. Shall repeat..,” she said in her Tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X