వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామాకు గార్డ్ ఆఫ్ ఆనర్: తొలి మహిళా సైనికాధికారిణిగా అరుదైన అవకాశం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని స్వాగతించే అరుదైన అవకాశాన్ని ఒక మహిళా సైనికాధికారిణి దక్కించుకుంది. ఆమె పేరు పూజా ఠాకూర్. వింగ్ కమాండర్‌గా ఉన్న పూజా ఠాకూర్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన అమెరికా అధ్యక్షుడికి సలామే శస్త్ర్ నుంచి... సైనిక వందనానికి దగ్గరుండి మరీ తోడ్కోని తీసుకెళ్లింది.

ఇలా ఒక అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చిన ఏకైక మహిళా అధికారిణిగా రికార్డు సాధించింది. అక్కడినుంచి సైనిక వందనం స్వీకరించే వేదిక వద్దకు ఒబామా చేరుకున్నారు. త్రివిధ దళాధిపతులు కూడా రాష్ట్రపతి భనవ్ వద్ద ఒబామాకు స్వాగతం పలికారు.

ఇరు దేశాల జాతీయగీతాల ఆలాపన పూర్తయిన తర్వాత ముందుగా రాష్ట్రపతి, ప్రధాని, ఆ తర్వాత ఒక్కొక్కరుగా కేంద్ర మంత్రులతో ఒబామా కరచాలనం చేశారు. రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్రమోడీ తన మంత్రివర్గ సహచరులను పరిచయం చేశారు. ఆ తర్వాత ఒబామా తనతో వచ్చిన ప్రతినిధులను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోడీకి పరిచయం చేశారు.

అపూర్వమైన ఆతిధ్యానికి కృతజ్ఞతలు: ఒబామా

అనంతరం అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా మాట్లాడుతూ భారత్‌లో లభించిన ఈ అపూర్వమైన ఆతిధ్యానికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఆయన మళ్లీ తన 'బీస్ట్' వాహనం ఎక్కి.. మహాత్మాగాంధీకి నివాళులర్పించేందుకు రాజ్ ఘాట్‌కు బయల్దేరి వెళ్లారు.

English summary
Wing Cmdr Pooja Thakur leads the Guard of Honour in Rashtrapati Bhavan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X