వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడి: తండ్రీకూతుళ్లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: దేశంలో కలకలం రేపిన పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కీలక పురోగతి సాధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న తండ్రీకూతుళ్లను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని లెథ్‌పొరాకు చెందిన తారిక్ అహ్మద్ షా, అతని కూతురు ఇన్షా తారిఖ్‌లను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు.

సోమవారం రాత్రి సోదాలు జరిపిన ఎన్ఐఏ అధికారులు మంగళవారం ఉదయం అహ్మద్, ఇన్షాలను అరెస్ట్ చేశారు. కాగా, పుల్వామా దాడికి కొద్ది రోజుల ముందు వీరు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు సమాచారం. అహ్మద్, ఇన్షాల అరెస్టుతో కేసుకు సంబంధించి ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది.

Pulwama attack case: NIA arrests a man and his daughter from Lethpora

వారం రోజుల క్రితం పుల్వామా ఉగ్రదాడికి సహకరించిన జైషే మొహమ్మద్ సభ్యుడు షరీ్ బషీర్ మాగ్రేను అరెస్ట్ చేశారు. పుల్వామా దాడిలో పాల్గొన్న ఆత్మాహుతి సభ్యుడు ఆదిల్ అహ్మద్ ధార్‌కు షకీల్ వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాడు.

షకీర్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ అధికారులు.. అతడు చెప్పిన సమాచారం ఆధారంగానే అహ్మద్, ఇన్షాలను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో 40 మంది జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్ బాలాకోట్‌పై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 300 మందికిపైగా ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.

English summary
In another breakthrough in the Pulwama terror case, the National Investigation Agency (NIA) has arrested a father-daughter duo from Jammu and Kashmir’s Lethpora.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X