వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడులు: భారత్‌కు అండగా నిలిచిన ప్రపంచ దేశాలు.. పాక్‌పై ఒత్తిడి

|
Google Oneindia TeluguNews

గతవారం జరిగిన పుల్వామా ఉగ్రదాడుల్లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో భారత్‌కు అండగా నిలిచాయి పలు ప్రపంచదేశాలు. అమెరికా, ఇజ్రాయిల్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, యూకే లాంటి దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్‌పై నిప్పులు చెరిగాయి. ప్రపంచదేశాలన్ని ఒక్కటవ్వడంతో పాకిస్తాన్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

Pulwama attack: World powers unite to back India on Pakistan-sponsored terror

భారత్, యూకేలు ఉగ్రవాదంతో చాలా నష్టపోయాయని గతవారం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు భారత్‌కు బ్రిటీష్ హైకమిషనర్ డామినిక్ ఆస్క్విత్. ఉగ్రవాదంకు భూమిపై చోటు లేదన్న ఆయన ఉగ్రవాదుల బారిన పడి మృతి చెందిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించాడు. మరోవైపు జైషేమహ్మద్ ఛీఫ్ మసూద్ అజార్‌ పేరును ఐక్యరాజ్యసమితి గ్లోబల్ టెరరిస్టుల జాబితాలో చేరుస్తున్నట్లు ఫ్రాన్స్ అంబాసిడర్ అలెగ్జాండర్ జిగ్లర్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా మసూద్ అజర్ పేరును ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించాడు.

జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజర్‌ను ఐక్యరాజ్య సమితి తన ఆంక్షల జాబితాలో చేర్చాలన్న భారత్ ప్రతిపాదనకు రష్యా మద్దతు తెలుపుతోందని అన్నారు ఆ దేశ మంత్రి డెనిస్ మాంత్రోవ్. ఉగ్రవాదంపై పోరులో రష్యా అన్ని సహకారాలు భారత్‌కు అందిస్తుందని ఆయన వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడులను ఖండిస్తూ న్యూజిలాండ్ పార్లమెంటులో ఆదేశ డిప్యూటీ ప్రధాని విన్స్‌టన్ పీటర్స్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన దాడిని ఖండిస్తూ తాను తీర్మానం సభలో ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించారు పీటర్స్. అంతేకాదు తమ దేశం దేశ ప్రజలు ఈ సమయంలో భారత్‌కు అండగా ఉంటామని చెప్పారు.

English summary
Major countries that unequivocally condemned the terror attack are the US, Israel, France, Russia, Germany and the United Kingdom. (Reuters)The world powers have joined India in condemning the worst terror strike carried out by Pakistan-based and ISI-supported Jaish-e-Mohammed in Pulwama of Jammu and Kashmir on February 14. Major countries that unequivocally condemned the terror attack are the US, Israel, France, Russia, Germany and the United Kingdom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X