వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా ఎఫెక్ట్... 48 గంటల్లో విడిచి వెళ్లండి: పాకిస్తానీలకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

బికనీర్: జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రవాద దాడిలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. దీనిపై దేశం మొత్తం ఆగ్రహంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. పాక్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్‌ను రద్దు చేసింది. పాక్ నుంచి దిగుమతి చేసుకునే వాటిపై 200 శాతం సుంకం విధించింది. అలాగే, భారత్‌కు చెందిన ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులను పాక్‌కు నిలిపేశాయి.

48 గంటల్లో వెళ్లిపోండి

48 గంటల్లో వెళ్లిపోండి

పాక్‌కతో క్రికెట్‌ మ్యాచ్‌లు నిలిపేయాలని పలువురు సూచిస్తున్నారు. పాకిస్తాన్ కళాకారులు భారతీయ చిత్ర పరిశ్రమలో పని చేయడాన్ని నిషేధిస్తున్నట్లు ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. తాజాగా, రాజస్థాన్‌లోని బికనేర్‌ జిల్లా కలెక్టర్‌ సంచలన ఆదేశాలు జారీ చేశారు. బికనీర్ జిల్లాలోని పాకిస్థానీలు 48 గంటల్లోనే నగరాన్ని విడిచి వెళ్లాలన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్‌పై సౌదీ రాజు ప్రశంసలు, ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీకి పయణం!పుల్వామా అటాక్ తర్వాత పాకిస్తాన్‌పై సౌదీ రాజు ప్రశంసలు, ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీకి పయణం!

ఆదేశాలు వెంటనే అమలులోకి

ఆదేశాలు వెంటనే అమలులోకి

ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని హోటళ్లు, లాడ్జిల్లో పాకిస్థానీలను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ దేశస్థులకు ఉద్యోగాలు ఇవ్వడం, వారితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపార సంబంధాలు వద్దని చెప్పారు. పాకిస్థాన్‌ రిజిస్ట్రేషన్ కలిగిన సిమ్‌ కార్డులను వినియోగించకూడదన్నారు. రెండు నెలల పాటు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు.

అందుకే ఆదేశాలు

అందుకే ఆదేశాలు

ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ పాల్ గౌతమ్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాలకు కారణాలు కూడా ఉన్నాయి. బికనీర్ జిల్లా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఈ చర్యలు చేపట్టారు. గత గురువారం పుల్వామాలోని సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై పాక్‌కు చెందిన జైష్ ఏ మహ్మద్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలభై మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో భారత్, పాక్‌ మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి.

English summary
The district collector of Bikaner on Monday issued an order directing Pakistani citizens to leave within 48 hours, citing a law and order situation in the aftermath of the Pulwama terror attack, PTI reported. Bikaner is a district in Rajasthan bordering Pakistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X