వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నీటి గాథ: చివరి వీడియోను తన భార్యకు పంపించిన అమర జవాను

|
Google Oneindia TeluguNews

జైషే మహ్మద్ ఉగ్రవాదులు సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన ఘటనలో 40 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే బస్సులో బయలుదేరిన సీఆర్‌పీఎఫ్ జవాన్లలో ఒక జవాను చివరిసారిగా ఓ వీడియో తన భార్యకు పంపాడు. ఆ వీడియోను ఆమె బయటపెట్టి కన్నీరుమున్నీరు అయ్యింది.

పుల్వామా దాడుల్లో అమరులైన జవాన్లలో ఒకరు 76వ బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ సుఖ్జీందర్ సింగ్. పంజాబ్‌లోని తర్న్ తరన్ ప్రాంతానికి చెందిన ఈ వీరజవాను తన భార్యకు చివరిసారిగా ఓ వీడియో పోస్టు చేశాడు. సీఆర్‌పీఎఫ్ బస్సులో ప్రయాణం చేస్తూ ఓ వీడియోను తన మొబైల్ ఫోనులో రికార్డు చేశాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఆత్మాహుతి దాడిలో అమరుడయ్యాడు సుఖ్జీందర్ సింగ్. అయితే భర్త చనిపోయిన బాధలో ఆ భార్య ఇన్నిరోజులు ఆ వీడియో చూడలేదు. శుక్రవారం చూసి దాడి జరగక కొన్ని క్షణాల ముందే రికార్డు చేసిన వీడియో చూసి కంటతడి పెట్టింది.

Pulwama martyrs last video to wife from CRPF bus before attack

సీఆర్‌పీఎఫ్ బస్సులో జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో ఆ వీడియోను సుఖ్జీందర్ సింగ్ రికార్డు చేశాడు. ఆ వీడియోలో బస్సులోని ఇతర జవాన్లతో పాటు సుఖ్జీందర్ సింగ్ కూడా కనిపించాడు. బస్సును కూడా రికార్డు చేశాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఇదే తన భార్యకు పంపిన చివరి వీడియో.ఇదిలా ఉంటే సుఖ్జీందర్ సింగ్‌కు తల్లిదండ్రులు, భార్య, ఏడునెలల బాలుడు ఉన్నారు. సీఆర్‌పీఎఫ్‌లో 2003లో చేరాడు. ఆసమయంలో ఆయనకు 19 ఏళ్లు. ఎనిమిది నెలల క్రితమే తను హెడ్ కానిస్టేబుల్‌గా ప్రమోట్ అయ్యాడు. ఈ వీడియోను చూసిన వారంత కంటతడి పెడుతున్నారు.

ఫిబ్రవరి 14న జరిగిన దాడితో అప్రమత్తమైన భారత సైన్యం వెంటనే ఈ దాడి సూత్రధారులను మట్టుబెట్టింది. ఇక పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించాలంటూ భారత ప్రభుత్వం ప్రపంచదేశాలను కోరుతోంది. ఈ క్రమంలోనే పాక్‌పై ప్రపంచదేశాలు ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే ఘటనతో పాకిస్తాన్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. అయితే ప్రపంచ వేదికలపై పాకిస్తాన్‌ను ఒంటరిని చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోంది.

English summary
Almost a week after 40 Central Reserve Police Force (CRPF) personnel were killed in a deadly suicide bomb attack in south Kashmir’s Pulwama, a martyr’s wife has shared the last video which her husband sent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X