వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడి: పాకిస్తాన్‌పై భారీ యాక్షన్‌కు భారత్ ప్లాన్?: రాజ్‌నాథ్ పెద్ద హింట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పుల్వామా దాడి అనంతరం పాకిస్తాన్ పైన భారత్ వరుసగా చర్యలు తీసుకుంటోది. రోజుకో షాక్ అన్నట్లుగా కఠిన చర్యలు తీసుకుంటోంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ రద్దు, దిగుమతి సరుకులపై 200 శాతం సుంకం, పలు దేశాలతో చర్చలు జరిపి పాకిస్తాన్‌ను ఏకాకి చేయడం, తాజాగా పాక్‌కు నీటిని నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం.. ఇలా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

ఈ అంశాలను పక్కనపెడితే కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పైన అతిపెద్ద యాక్షన్ తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతున్నట్లుగా రాజ్‌నాథ్ హింట్ ఇచ్చారు. అయితే ఆ మేజర్ యాక్షన్ ఏమిటనేది తెలియాల్సి ఉంది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

Pulwama terror attack: India planning major action against Pakistan? Rajnath Singh drops big hint

ప్రజల ఆశలు, అంచనాలు నెరవేర్చే సమయం వస్తుందని (పాక్ పైన ప్రతీకారాన్ని ఉద్దేశిస్తూ) వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి అనంతరం దేశంలో ఎవరు కూడా ఏ కార్యక్రమంలో ఉత్సాహంగా కనిపించడం లేదని చెప్పారు. తద్వారా భారత్ ఇంకా బాధలోనే ఉందని తెలిపారు.

కానీ నేను కచ్చితంగా హామీ ఇస్తున్నాను, నేను కచ్చితమైన హామీ ఇవ్వాలనుకుంటున్నాను, ప్రజలు కోరుకుంటున్నట్లుగా ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం వస్తుంది, భారతీయుల ఆలోచనలు, అంచనాలు నిజమయ్యే రోజు వస్తుంది, అందరి అంచనాలు నెరవేరుస్తాము.. అని రాజ్‌నాథ్ చెప్పారు.

అయితే, ప్రజల ఆలోచన ఏమిటి, ఆ సమయం ఎప్పుడు వస్తుంది, ఎలా ప్రతీకారం తీర్చుకుంటారనే అంశంపై రాజ్‌నాథ్ పెదవి విప్పలేదు. అయితే పాకిస్తాన్ పైన మరో గట్టి చర్యలపై రాజ్‌నాథ్ హింట్ ఇచ్చారని చెబుతున్నారు. కాగా, ఫిబ్రవరి 14వ తేదీన జైష్ ఏ మొహమ్మద్ సూసైడ్ బాంబర్ ఉగ్రవాది 42 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలి తీసుకున్న విషయం తెలిసిందే.

English summary
A week after terrorists belonging to Pakistan-based Jaish e Muhammed (JeM) terror group carried out a deadly strike in Jammu and Kashmir’s Pulwama killing 40 CRPF soldiers, Home Minister Rajnath Singh has dropped a big hint with regard to the action the government is planning against the neighbouring country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X