వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా ఉగ్రదాడులు: అమరజవాన్లకు దేశం సెల్యూట్... అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు

|
Google Oneindia TeluguNews

గురువారం పుల్వామాలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత దాడిలో అమరులైన జవాన్లకు మోడీతో పాటు ఆయన కేబినెట్ మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం అమరుల మృతదేహాలను వారి సొంత గ్రామాలకు తరలించారు. దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. మరో వైపు తన మిగతా కొడుకులను కూడా దేశం కోసం అంకితం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అమరులైన జవాన్ తల్లిదండ్రులు చెప్పారు. ఈ మాటలు వారిలోని ధైర్యానికి అద్దం పడుతున్నాయి.

 ఏఎస్ఐ మోహన్ లాల్‌కు ఘన నివాళులు అర్పించిన ఉత్తరాఖండ్ సీఎం

ఏఎస్ఐ మోహన్ లాల్‌కు ఘన నివాళులు అర్పించిన ఉత్తరాఖండ్ సీఎం

పాకిస్తాన్‌కు నిరసనగా అమరుల కుటుంబాలకు భరోసా ఇస్తే దేశవ్యాప్తంగా క్యాండిల్ లైట్ ప్రదర్శనలు చేశారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ జవాను మృతదేహానికి సెల్యూట్ చేసేందుకు ఓ చిన్నారి ఆర్మీ డ్రెస్‌లో రావడం విశేషం. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఏఎస్ఐ మోహన్ లాల్ మృతదేహం డెహ్రాడూన్‌కు చేరుకుంది. అక్కడ ఆరాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రి కుమార్తె అమరుడైన జవానుకు సెల్యూట్ చేసి నివాళులు అర్పించింది.

బీహార్

బీహార్

సంజయ్ కుమార్ సిన్హాకు సీఎం నితీష్ కుమార్ నివాళులు

బీహార్‌కు చెందిన జవాను సంజయ్ కుమార్ సిన్హా మృతదేహానికి ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ నివాళులు అర్పించారు.

 వారణాసిలో రమేష్ యాదవ్ అంతిమ యాత్రకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు

వారణాసిలో రమేష్ యాదవ్ అంతిమ యాత్రకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన 12 మంది జవాన్లు అమరులయ్యారు. వారణాసికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను రమేష్ యాదవ్‌ అంతిమయాత్రలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 రోహితాష్ లాంబాను చూసి కన్నీరు మున్నీరు అయిన గ్రామస్తులు

రోహితాష్ లాంబాను చూసి కన్నీరు మున్నీరు అయిన గ్రామస్తులు

రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను రోహితాష్ లాంబా పార్థీవదేహం అతని స్వగ్రామం జైపూర్ లోని గోవింద్ పురాకు చేరుకుంది. చాలామంది గ్రామస్తులు కన్నీరుమున్నీరు అయ్యారు.

English summary
PM Narendra Modi and his ministers along with opposition leaders have paid their tributes to Pulwama martyrs in New Delhi on Friday evening. Now, the bodies of slain soldiers are being sent to their respective families.While many chief ministers have announced ex-gratia and jobs to martyrs' kin, the scars from Pulwama's afternoon of terror that left 40 CRPF jawans dead are too deep to be healed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X