వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరజవాన్లకు ప్రధాని మోడీ, రాహుల్ నివాళి: భారీ కాన్వాయ్‌లు వస్తుంటే... ప్రజలకు రాజ్‌నాథ్ విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ఎయిర్ బేస్‌లో అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, సభాపతి సుమిత్రా మహాజన్ తదితరులు నివాళులు అర్పించారు. అమరజవాన్ల భౌతికకాయాలు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాయి. అనంతరం వారు నివాళులు అర్పించారు.

ప్రధాని నరేంద్ర మోడీ జవాన్ల చుట్టూ తిరిగి నివాళులు అర్పించారు. అమర జవాన్ల అంత్యక్రియల్లో పాల్గొనాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ప్రధాని ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటన చేశారు.

Pulwama terror attack: PM Modi pays his tribute to martyrs at wreath laying ceremony at Palam Airport

ఈ నిబంధనలకు ప్రజలు సహకరించాలి: రాజ్‌నాథ్

ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడారు. జవాన్ల కుటుంబాలకు ఎక్కువ మొత్తంలో సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరామని రాజ్‌నాథ్ చెప్పారు. ఉన్నతాధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. సైనికుల భారీ కాన్వాయ్‌లు వెళ్లే సమయంలో పౌరులు ఎవరూ ఆ ప్రాంతంలో తిరగరాదని చెప్పారు. ఈ నిబంధనలు ప్రజలకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పారు. ఈ నిబంధనలకు ప్రజలు సహకరించాలని కోరారు.

English summary
Prime Minister Narendra Modi attends the wreath-laying ceremony at Palam Airport in New Delhi. Maharashtra chief minister Devendra Fadnavis has announced a compensation of Rs. 50 lakh for the family of the jawans who lost their lives in the Pulwama attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X