వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్లో ఐఫోన్ బుక్ చేస్తే చెక్కముక్కలు వచ్చాయి

By Srinivas
|
Google Oneindia TeluguNews

పుణే: అన్‌లైన్‌లో ఐఫోన్ కొనుగోలు చేస్తే చెక్కముక్కలు వచ్చిన సంఘటన పుణేలో జరిగింది. ఇటీవలి కాలంలో ఈ-మార్కెట్ పుంజుకుంటున్న విషయం తెలిసిందే. పలువురు ఆన్ లైన్ ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అప్పుడప్పుడు వస్తువులకు బదులు ఇతర వస్తువులు వస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

ఆన్‌లైన్ పోర్టళ్ల ద్వారా కొనుగోలు చేస్తున్న వస్తువుల స్థానంలో రాళ్లు, చెక్కముక్కలు డెలివరీ అవుతున్న ఘటనలు అధికమవుతున్నాయి. పూణేకు చెందిన దర్శన్ కాబ్రా అనే వ్యక్తి స్నాప్ డీల్ ద్వారా రెండు ఐఫోన్లు (ఐఫోన్ 4ఎస్) బుక్ చేశాడు.

Pune-based man orders iPhones, receives wood pieces!

బుక్ చేసిన కొన్ని రోజుల తర్వాత అతని చిరునామాకు ఓ ప్యాక్ వచ్చింది. కాబ్రా దానిని విప్పి చూసి షాకయ్యాడు. అందులో ఐఫోన్‌కు బదులు చెక్కముక్కలు ఉన్నాయి. అప్పటికీ దానిని తీసుకు వచ్చిన డెలివరీ బాయ్ అక్కడే ఉన్నాడు.

క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో ఐఫోన్లును బుక్ చేశాడు. ఆర్డర్ ప్రకారం రెండు ఫోన్లకు కలిపి కాబ్రా రూ.40,508 చెల్లించవలసి ఉంది.

ఫోన్లకు బదులు చెక్కముక్కలు రావడంతో తాను నగదు చెల్లించనని స్నాప్ డీల్ డెలివరీ బాయ్‌కి చెప్పాడు. దీనిపై కాబ్రా స్పందించాడు. క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో బుక్ చేయడంతో బతికిపోయానని చెప్పాడు.

English summary
In yet another goof up, a man who ordered iPhones from the e-commerce website Snapdeal, got the shock of his life when he was delivered pieces of wood!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X