వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్త చనిపోయాక మరో వ్యక్తితో సహజీవనం: ఇద్దరితో కలిసి ప్రియుడి హత్య

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: రెండేళ్ళుగా సహజీవనం చేస్తూ వివాహం చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిని ప్రియురాలు హత్య చేసింది. అయితే ఈ కేసులో ప్రియురాలు పాత్ర నిర్ధారణ కావడంతో పూణె సిటీ సెషన్స్ కోర్టు నిందితురాలికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది.

భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకొంది ఓ వివాహిత. అయితే ఆ సంబంధం కారణంగా వారిద్దరూ కూడ సహజీవనం చేస్తున్నారు. అయితే ఆ వ్యక్తికి అప్పటికే వివాహమై భార్య, పిల్లలున్నారు.

పూణె నగరంలోని శివాజీనగర్ రైల్వే స్టేషన్ వద్ద గప్‌చిప్‌ల బండిని నడుపుకొంటూ హనుమంతు జీవనం సాగిస్తున్నాడు. అతడికి వివాహమై భార్య, పిల్లున్నారు. అయితే సరిత అనే మహిళకు భర్త చనిపోయాడు. దీంతో హనుమంతుతో పరిచయం పెంచుకొని సరిత అతడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది.

వివాహతేర సంబంధం సహజీవనం

వివాహతేర సంబంధం సహజీవనం

హనుమంతు, సరితల మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. అంతేకాదు వారిద్దరూ రెండేళ్ళుగా సహజీవనం కూడ చేస్తున్నారు. అయితే అప్పటికే హనుమంతుకు వివాహమైంది. అయితే వారి బంధం హనుమంతు మొదటి భార్యకు తెలిసింది. దీంతో హనుమంతుతో మొదటి భార్య గొడవకు దిగింది.

రెండోపెళ్ళి చేసుకోవాలని సరిత వేధింపులు

రెండోపెళ్ళి చేసుకోవాలని సరిత వేధింపులు

తనను రెండో పెళ్ళి చేసుకోవాలని సరిత హనుమంతును కోరింది. రెండేళ్ళుగా సహజీవనం చేసిన తర్వాత వివాహం ప్రస్తావన తెచ్చింది. అయితే అప్పటికే వివాహమైన హనుమంతు మాత్రం సరితను వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అంతేకాదు అదే సమయంలో మొదటి భార్యతో గొడవలు జరుగుతున్న తరుణంలో రెండో పెళ్ళికి దూరంగా ఉండాలని హనుమంతు నిర్ణయించుకొన్నాడు.

హనుమంతును హత్య చేయించిన సరిత

హనుమంతును హత్య చేయించిన సరిత

తనను రెండో పెళ్ళి చేసుకొనేందుకు హనుమంతు ముందుకు రాకపోవడంతో అతడిని చంపాలని ప్లాన్ చేసింది సరిత పూణెలోని ఆకాశవాణి సెంటర్ వద్దకు రావాలని హనుమంతు సెల్‌ఫోన్‌కు సమాచారాన్ని పంపింది. ఈ సమాచారం ఆధారంగా అక్కడికి వెళ్ళిన హనుమంతును పెళ్ళి విషయమై సరిత గొడవ పెట్టుకొంది. పెళ్ళి చేసుకోనని హనుమంతు తెగేసి చెప్పాడు. దీంతో సరిత తనతో వచ్చిన ఇద్దరి సహయంతో హనుమంతును హత్య చేసింది.

సరితకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు

సరితకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు

సరితకు జీవిత ఖైదును విధిస్తూ ఫూణె సిటీ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. హనుమంతు సెల్‌పోన్‌కు సరిత నుండి వచ్చిన బెదిరింపు మేసేజ్‌ల ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సాక్షాలను కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ మేరకు నిందితురాలు సరితకు కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు

English summary
Pune city sessions court judge ordered life sentence to Saritha on Friday.Saritha killed her lover Hanumanth recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X