వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉన్నదంతా దేశానికి రాసిచ్చిన దంపతులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

పూణె :వంద రూపాయాలు అప్పు ఇవ్వడానికి వెనుకాడే రోజులు ఇవి. కాని, ఉన్న ఆస్తి అంతా దేశానికి రాసిచ్చిన దంపతుల ఔదార్యం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఉన్నదాంట్లో కాసింత దానం చేయడం కాదు..ఉన్నదంతా రాసిచ్చిన దంపతులు ప్రతి ఒక్కరి ప్రశంసలను పొందుతున్నారు.

దానం చేయడంలో కర్ణుడు మించిన వారు లేరంటారు. చనిపోయే సమయంలో కూడ కర్ణుడు తనవద్ద ఉన్న వాటిని దానం చేశాడని పురాణాలు చెబుతన్నాయి. కాని, మహరాష్ట్రలోని పూణెలో నివాసం ఉంటున్న వృద్ద దంపతులు మాత్రం తమ ఆస్తిని దేశానికి రాసిచ్చారు. తమకు ఏమి మిగుల్చుకోకుండా దానం చేసి తమ గొప్పతనాన్ని చాటిచెప్పారు.

తమకు ఉన్న ఆస్తిని దేశానికి రాసిస్తూ వీలునామా రాశారు. పూణెలో నిాసం ఉండే 73 ఏళ్ళ ప్రకాష్ కేల్కర్ ,ఆయన భార్య వీలునామా రాశారు.2013 లో ఈ ఆలోచన వచ్చిందని కేల్కర్ చెప్పారు.వీలునామా రాసేటప్పుడు అందరిని సంప్రదించారు ఆ దంపతులు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

తమ సంపదలో 30 శాతం సంపదను ప్రదానమంత్రి సహయనిధికి, 30 శాతం సహాయనిధిని ముఖ్యమంత్రి సహాయనిధికి ,30 శాతం సైనిక దళాలకు,10 శాతం సమాజం కోసం పాటుపడే స్వచ్చందసంస్థలను ఐదు ఎంపిక చేసి వాటికి ఇవ్వాలని రాశారు.ఈ సంపదను సైనికులు,రైతులు, ప్రకృతి వైపరీత్యాల భాదితుల కోసం ఖర్చు చేయాలన్నదే తమ తపనగా ఆ దంపతులు చెప్పారు.

English summary
prakash kelkar wealth given to country.prakash kelkar and his wife will. kelkar want to 30 percent money for pm relief fund,30 percent cm relief fund,30 percent army, 10 percent for ngos .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X