వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సేఫ్ సిటీస్: సురక్షిత నివాస నగరాల్లో మొదటి స్థానంలో పూణే..నాలుగో స్థానంలో తిరుపతి

|
Google Oneindia TeluguNews

పూణే, నవీ ముంబై, గ్రేటర్ ముంబైలు భారత్‌లో నివసించేందుకు అత్యంత అనువైన ప్రాంతాలని ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనే సంస్థ వెల్లడించింది. దేశ రాజధాని ఈ జాబితాలో 65వ స్థానంలో నిలిచింది. ప్రధాని నరేంద్ర మోడీ నియోజకవర్గం వారణాసి 33వ స్థానంలో నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలో వారణాసి తొలిస్థానంలో నిలిచింది. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ విడుదల చేసిన 111 నగరాల్లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి 14 నగరాలు ఇందులో ఉన్నాయి. ఈ నివేదికను కేంద్ర గహనిర్మాణ, పట్టణాభివద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుపతి నగరం నాలుగో స్థానంలో నిలువగా... చంఢీగఢ్ ఐదో స్థానం, థానే ఆరోస్థానం, రాయ్‌పూర్ ఏడో స్థానం, ఇండోర్ ఎనిమిదో స్థానం, విజయవాడ తొమ్మిదవ స్థానం, భోపాల్ 10వ స్థానంలో నిలిచింది.చెన్నై 14వ ర్యాంకు సొంతం చేసుకోగా... కోల్ కతా నగరం సర్వేలో పాల్గొనలేదు. అహ్మదాబాద్ 23వ ర్యాంకు సొంతం చేసుకోగా.. హైదరాబాద్ 27వ ర్యాంకు పొందింది. మొత్తం నాలుగు అంశాలపై సర్వే చేశారు. పాలనా, సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలపై సర్వే చేసి దాని ఆధారంగా నివేదిక రూపొందించారు.

Pune stands first Tirupati stands fourth in Ease of Living Index

ఇక ఉత్తర్ ప్రదేశ్ నుంచి గజియాబాద్ (46వ స్థానం), సోనియాగాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలి (49వ స్థానం), ఆగ్రా (55వ స్థానం), లక్నో (73వ స్థానం), కాన్పూర్ (75వ స్థానం), బరేలీ (81 స్థానం), అలీగర్ (86వ స్థానం), మొర్దాబాద్ (89వ స్థానం), అలహాబాద్ (96వ స్థానం), మీరట్ (101వ స్థానం), సహారన్‌పూర్, (103వ స్థానం), రాంపూర్ (111వ స్థానం)లో నిలిచింది. ఇక పాలనా విషయంలో వారణాసి 25 మార్కులకు గాను 9.68 మార్కులు సాధించగా నవీ ముంబై 16.7 మార్కులతో తొలిస్థానంలో నిలిచింది. భద్రతలో 6.25 మార్కులకు గాను వారణాసి 1.51 మార్కులు సాధించిది.

ఇక మొదటి 10 నగరాల తర్వాత అత్యంత నివసించేందుకు అత్యంత అణువైన నగరాలు తెలంగాణ నుంచి కరీంనగర్ 11వ స్థానంలో నిలవగా... తిరుచిరాపల్లి, బిలాస్‌పూర్, చెన్నై. జబల్‌పూర్, అమరావతి, విశాఖపట్నం, భువనేశ్వర్, సూరత్, వసాయి విరార్, నాషిక్, సోలార్‌పూర్, అహ్మదాబాద్, ఉజ్జయినీ, కోయంబత్తూర్, ఈరోడ్, హైదరాబాద్, మదురై, తిరుపూర్, జైన్‌పూర్. నాగ్‌పూర్, గ్వాలియర్‌లు వరుసగా నిలిచాయి.

English summary
Pune, Navi Mumbai and Greater Mumbai are the top three liveable places in India, according to the latest ‘Ease of Living Index’ released on Monday. National capital Delhi ranked a measly 65th.Prime Minister Narendra Modi’s constituency Varanasi ranks 33 in the Swachh Survekshan list and is placed on top in Uttar Pradesh. With rank 34, Jhansi comes second in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X