Puneeth Rajkumar: కన్నీరు పెట్టుకున్న బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, శివన్న, రానా, ప్రభుదేవా !
బెంగళూరు: శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో లక్షలాది మంది పునీత్ రాజ్ కుమార్ అభిమానులు చివరిసారిగా ఆయన్ను పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్ టీఆర్, దగ్గుబాటి రానా, ప్రభుదేవా తదితరులు కఠీరవ స్టేడియం చేరుకుని పునీత్ రాజ్ కుమార్ ను నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ నందమూర్తి బాలకృష్ణ, జూనియర్ పట్టుకుని కన్నీరు పెట్టుకోవడంతో అక్కడ ఉన్న వారు చలించిపోయారు. ప్రముఖ నటుడు, దర్శకుడు ప్రభుదేవా పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించారు. శివరాజ్ కుమార్ ను జూనియర్ ఎన్ టీఆర్, నందమూరి బాలకృష్ణ, ఓదార్చారు. ఆదివారం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ప్రభుత్ లాంఛనాలతో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నిర్వహించవలసిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర సందర్బంగా శాంతిని కాపాడాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, పునీత్ రాజ్ కుమార్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ అభిమానులకు మనవి చేశారు. ప్రైవేటు ఆస్తులను హాని కలిగించకూడదని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు మనవి చేశారు.
Puneeth Rajkumar: నిన్న రాత్రి బర్త్ డే పార్టీలో పునీత్ రాజ్ కుమార్, అక్కడ ఏం జరిగింది ?

లక్షలాది మంది అభిమానులు
శ్యాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో లక్షలాది మంది పునీత్ రాజ్ కుమార్ అభిమానులు చివరిసారిగా ఆయన్ను పార్థీవ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. కర్ణాటకలోని వివిద జిల్లాల నుంచి లక్షలాది మంది అభిమానులు కంఠీరవ స్టేడియం చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆదివారం అంత్యక్రియలు
శనివారం బెంగళూరులోని రాజ్ కుమార్ సమాధి ఉన్న కంఠీరవ స్టూడియలో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నిర్విహించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే పునీత్ రాజ్ కుమార్ కుమార్తె శనివారం సాయంత్రం 5 గంటల పైన బెంగళూరు చేరుకునే అవకాశం ఉండటంతో పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించాలని నిర్ణయించామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ శనివారం మీడియాకు చెప్పారు.

ఇది కుటుంబ సభ్యుల నిర్ణయం
పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు, శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ తదితరులతో చర్చించిన తరువాత అప్పు అంత్యక్రియలు ఆదివారం ప్రశాంతంగా నిర్వహించాని కర్ణాటక ప్రభుత్వం, పునీత్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి నిర్ణయం తీసుకున్నామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అన్నారు.
బాలయ్య, జూనియర్ ఎన్ టీఆర్, రానా, ప్రభుదేవా నివాళి
నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్ టీఆర్ వేర్వేరుగా బెంగళూరులోని కఠీరవ స్టేడియం చేరుకుని పునీత్ రాజ్ కుమార్ ను నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ సోదరుడు శివరాజ్ కుమార్ నందమూర్తి బాలకృష్ణ, జూనియర్ ఎన్ టీఆర్ ను పట్టుకుని కన్నీరు పెట్టుకోవడంతో అక్కడ ఉన్న వారు చలించిపోయారు. శివరాజ్ కుమార్ ను, పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను జూనియర్ ఎన్ టీఆర్, నందమూరి బాలకృష్ణ ఓదార్చారు. దగ్గుబాటి రానా, ప్రముఖ నటుడు, దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా తదితరులు పునీత్ రాజ్ కుమార్ కు నివాలులు అర్పించారు.
శాంతిని కాపాండండి
నివారం నిర్వహించవలసిన పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీడియాకు చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర సందర్బంగా శాంతిని కాపాడాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, పునీత్ రాజ్ కుమార్ సోదరులు శివరాజ్ కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ అభిమానులకు మనవి చేశారు. ప్రైవేటు ఆస్తులను హాని కలిగించకూడదని బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు మనవి చేశారు.