• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పంజాబ్ ఎఫెక్ట్ : రాజస్తాన్‌లో మళ్లీ అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్-నాయకత్వ మార్పుకు డిమాండ్

|

పంజాబ్‌ ప్రభుత్వంలో నాయకత్వ మార్పు జరిగి 24 గంటలు గడవకముందే... రాజస్తాన్‌లో దాని ఎఫెక్ట్ కనిపిస్తోంది. పంజాబ్ తరహాలో రాజస్తాన్‌ ప్రభుత్వంలోనూ నాయకత్వ మార్పు జరగాలని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుత సీఎం అశోక్ గెహ్లాట్ స్థానంలో యువ నేత సచిన్ పైలట్‌ను సీఎంగా నియమించాలని తాజాగా పీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి మహేశ్ శర్మ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు అశోక్ గెహ్లాట్,సచిన్ పైలట్ మధ్య మళ్లీ నాయకత్వ పోరుకు ఆజ్యం పోసేలా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌లో లుకలుకలు-హైకమాండ్‌ను కలవరపెడుతున్న పంజాబ్,ఛత్తీస్‌గఢ్-నాయకత్వ మార్పుకు రెబల్స్ డిమాండ్కాంగ్రెస్‌లో లుకలుకలు-హైకమాండ్‌ను కలవరపెడుతున్న పంజాబ్,ఛత్తీస్‌గఢ్-నాయకత్వ మార్పుకు రెబల్స్ డిమాండ్

సచిన్ పైలట్ మద్దతుదారుల డిమాండ్...

సచిన్ పైలట్ మద్దతుదారుల డిమాండ్...

మహేశ్ శర్మ మాట్లాడుతూ... 'రాజస్తాన్‌ ప్రభుత్వంలోనూ నాయకత్వ మార్పు జరగాలి.సచిన్ పైలట్ కృషి వల్లే రాజస్తాన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.కాబట్టి సచిన్ పైలట్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం చేయాల్సిందే.సచిన్ పైలట్‌ను సీఎం చేస్తేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు ప్రయోజనం చేకూరుతుంది.' అని వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల అశోక్ గెహ్లాట్ ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.కొన్నాళ్లుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అటు పంజాబ్ ఎఫెక్ట్... ఇటు గెహ్లాట్ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో సచిన్ పైలట్‌ను సీఎం చేయాలనే డిమాండ్ మళ్లీ ఊపందకుంటోంది.

అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ వివాదం

అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ వివాదం

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సచిన్ పైలటే కారణమని ఆయన మద్దతుదారులు చెబుతుంటారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సచిన్ పైలట్ తనకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ సీనియర్ నేత,గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో అశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపింది.సచిన్ పైలట్ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. సీఎం పదవి దక్కలేదన్న అసంతృప్తి సచిన్ పైలట్‌లో... తన పదవికి ఎక్కడ ఎసరు పెడుతాడేమోనన్న టెన్షన గెహ్లాట్‌లో... ఇలా ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు చాలాకాలం కొనసాగాయి. గతేడాది ఆ విభేదాలు పీక్స్‌కి చేరాయి.పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో కాంగ్రెస్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు,సచిన్‌తో పాటు ఆయనకు మద్దతునిస్తున్న 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వేటుకు స్పీకర్‌కు సిఫారసు చేసింది.దీంతో సచిన్ పైలట్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే తదనంతర పరిణామాల్లో సచిన్ పైలట్ వెనక్కి తగ్గడం... కాంగ్రెస్ అధిష్ఠానం గెహ్లాట్‌తో ఆయనకు సయోధ్య కుదర్చడంతో వివాదం సద్దుమణిగింది. మళ్లీ ఇన్నాళ్లకు పంజాబ్ కారణంగా పాత విభేదాలు బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి.

  Telangana Lockdown : జాతరను మరిపించిన వైన్ షాపులు.. గంటలకొద్దీ క్యూలైన్ లో
  ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో లుకలుకలు...

  ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లో లుకలుకలు...

  అటు ఛత్తీస్‌గఢ్‌లోనూ కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు అలజడి రేపుతున్నాయి. ఇక్కడ సీఎం కుర్చీ కోసం ప్రస్తుత సీఎం భూపేష్ బాఘల్,సీనియర్ నేత టీఎస్ సింగ్ డియో మధ్య వివాదం నడుస్తోంది. 2018లో భూపేష్ భాఘల్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన సమయంలో... చెరో రెండున్నరేళ్లు సీఎం కుర్చీలో కూర్చొనేందుకు తనకు హామీ ఇచ్చారని టీఎస్ సింగ్ వర్గం చెబుతోంది. కానీ ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవట్లేదని ఆరోపిస్తోంది. ఈ పంచాయితీ ఇటీవల ఢిల్లీ పెద్దల వద్దకు చేరింది. భూపేష్ బాఘల్,టీఎస్ సింగ్ డియో ఇద్దరూ ఇటీవల (ఆగస్టు 24) ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లో నాయకత్వ మార్పు తప్పదేమోనన్న చర్చ జరిగింది.కానీ ఇప్పటికైతే ఆ దిశగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు.గతంలో అంతర్గత కుమ్ములాటల కారణంగానే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.జ్యోతిరాధిత్య సింధియా పార్టీపై తిరుగుబాటు చేసి తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు.దీంతో అక్కడ కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది.అసలే దేశవ్యాప్తంగా ఢీలా పడి పునర్వైభవం కోసం పాకులాడుతున్న వేళ రాజస్తాన్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కాంగ్రెస్‌ను మళ్లీ కలవరపెడుతున్నాయి.

  English summary
  Less than 24 hours after the change of leadership in the Punjab government ... its effect is visible in Rajasthan. Supporters of former Deputy CM Sachin Pilot are demanding a change of leadership in the Rajasthan government on the lines of Punjab.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X