వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్ద నగదు నోట్ల రద్దు ఎఫెక్ట్, పంజాబు వ్యాపారికి 85 బ్యాంకు ఖాతాలు

పంజాబుకు చెందిన ఓ వ్యాపారి 85 బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నట్టుగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు గుర్తించారు.ప్రజల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ఈ మేరకు వ్యాపారి కి 85 ఖాతాలను గుర్తించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీగడ్ :పెద్ద నగదు నోట్లను రద్దు చేయడంతో తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని మార్చుకొనేందుకు వ్యాపారులు వక్రమార్గాలను అనుసరిస్తున్నారు. వీరికి కొందరు అధికారులు కూడ సహకరిస్తున్నట్టుగా వెల్లడైంది. అయితే కొందరు ప్రజలు ఇచ్చిన సమాచారంతో ఒక వ్యాపారికి 85 ఖాతాలు ఉన్న విషయాన్ని గుర్తించారు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు.

పంజాబులోని ఒక వ్యాపారి తన దగ్గర ఉన్న నల్లధనాన్ని మార్చుకొనేందుకు సుమారు 85 బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ప్రజల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ఈ ఖాతాలను గుర్తించారు.

punjab business man have 85 accounts in banks

పెద్ద నోట్ల ను రద్దు చేసిన తర్వాత నల్లధనం కలిగిఉన్న వ్యక్తులు నల్లధనాన్ని మార్చుకొనేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే పంజాబులోని ఓ వ్యాపారి 85 బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్నాడు.

అయితే ఈ బ్యాంకు ఖాతాలు ఎప్పటి నుండి ఆయన నిర్వహిస్తున్నాడు. ఆయా ఖాతాల్లో ఎంత నగదును డిపాజిట్ అయిందనే విషయమై ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు.
పంజాబు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుండి ఎక్కువగా నల్లధనం మార్పిడి కోసం అక్రమాలకు పాల్పడ్డారనే విషయాన్ని అదికారులు గుర్తించారు. ప్రజల నుండి వచ్చిన సమాచారం ఆధారంగానే ఈడీ అధికారులు పంజాబు వ్యాపారి 85 ఖాతాలను కలిగి ఉన్న విషయాన్ని గుర్తించారు.

English summary
a punjab business man was laughing all the way to his 85 bank accounts until the enforcement directorate caught up with him on wednesday night.concerned citizens have been actively supplying information and aiding raiding teams about those hoarding the new currency, and those bogus bank accounts and black money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X