వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో ఉంది 9 మంది, పడింది 5 ఓట్లు : బోరునవిలపిస్తోన్న అభ్యర్థి

|
Google Oneindia TeluguNews

చండీగఢ్ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటుంటే .. కాంగ్రెస్ పార్టీ అంతర్మథన పడుతోంది. కానీ పంజాబ్ కు చెందిన ఓ నేత మాత్రం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు 5 ఓట్లు రావడమే. అయితే అతని కుటుంబంలో 9 ఓట్లు ఉంటే తనకు 5 ఓట్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు.

Punjab Candidate Cries After Getting Only 5 Votes

5 ఓట్లే వచ్చాయి ?
జలంధర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసిన సదరు వ్యక్తికి కేవలం ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. అతనిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కిందపడి మరి ఏడ్చాడు. కారణం ఏంటంటే అతనికి పోలైన ఓట్లు కేవలం ఐదు మాత్రమే. ఐదు ఓట్లు వస్తే ఎందుకు ఏడవడం అని సందేహాం రావొచ్చు. కానీ అతని సొంతింట్లోనే 9 మంది ఉన్నారు. వారు కూడా తనను మోసం చేశారు .. ఓటేయలేదని బాధ అతనిలో ఊబికి వస్తోంది. మిగతా నలుగురు తనకు ఎందుకు ఓటేయలేదని ప్రశ్న అతని మెదడును తొలచివేస్తోంది.

ఆగని కన్నీరు
అతను ఏడుస్తూనే అతని కుటుంబసభ్యులను నిందించాడు. తనకు ఎందుకు ఓటేయలేదో అర్థం కావడం లేదన్నారు. అలాగే ఈవీఎలం పనితీరుపై కూడా అనుమానం వ్యక్తంచేశారు. తనను ఈవీఎం మిషిన్లు మోసం చేయలేదు కదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తూ .. మీ ఇంట్లోని వారు మీకు మద్దతివ్వకుంటే బయటి వారు ఎలా ఓటేస్తారని భావిస్తారని అడిగారు. ఈ ఎన్నికలతో తనకు బుద్ధొచ్చిందని .. మరోసారి పోటీ చేయనని సమాధానం ఇచ్చారు. అయితే అతనికి పడిన ఓట్లను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తూ స్పందిస్తున్నారు.

English summary
The man, who hails from Jalandhar, stood independently and sadly, got only 5 votes. When he was being interviewed, he broke down and started crying. But, he is not crying because he got only 5 votes. He is crying because he got 5 votes despite having 9 people in his own family. Yes, his own family members betrayed him and didn't vote for him!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X