Sensational: మోదీ ప్రభుత్వం మీద సీఎం ఫైర్, పఠాన్ కోట్ కు మిలటరీని పంపించి రూ. 7.5 కోట్లు డిమాండ్ !
పంజాబ్/పఠాన్ కోట్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పఠాన్ కోట్ ఉగ్రదాడి విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. పఠాన్ కోట్ లో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి సైన్యం వచ్చిందని, అందుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ను రూ. 7. 50 కోట్లు అడిగిందని, ఆ డబ్బు తన ఎంపీ నిధుల నుంచి తీసుకోవాలని అప్పట్లో తానే కేంద్ర ప్రభుత్వానికి చెప్పానని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2016లో పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు చోరబడిన సమయంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పఠాన్ కోట్ కు సైనికులను పంపించిందని, అప్పుడే పంజాబ్ ను రూ. 7.50 కోట్లు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ను కోరిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశంలో పంజాబ్ ఒక భాగం కాదని మీరు లిఖితపూర్వకంగా రాసిస్తే రూ. 7.50 కోట్లు మేము ఇస్తామని ఆ రోజు తాను చెప్పానని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.

పఠాన్ కోట్ లో ఉగ్రదాడి
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పై 2016 జనవరి 2వ తేదీన ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆ సమయంలో భారత ఆర్మీ జవాన్లు ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఉగ్రవాదులు జరిపినదాడుల్లో ఏడు మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. భారత జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఐదు మంది ఉగ్రవాదులు అంతం అయ్యారు.

పంజాబ్ సీఎం అయిన వెంటనే కేంద్రాన్ని టార్గెట్ చేసిన మాన్
పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నారు. నిన్న చండీగఢ్ ను పంజాబ్ కు ఇచ్చేయాలని, కేంద్ర ప్రభుత్వం మా మీద పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోమని, న్యాయపోరాటం చెయ్యడానికి మేము సిద్దంగా ఉన్నామని పంజాబ్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ఇప్పుడు పఠాన్ కోట్ ఉగ్రదాడి విషయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారతదేశంలో పంజాబ్ లేదా ?
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పఠాన్ కోట్ ఉగ్రదాడి విషయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వం మీద సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పంజాబ్ పరాయి దేశంలో ఉన్నట్లు చూస్తోందని, వారికి పంజాబ్ ప్రజల మీద ప్రేమలేదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం రూ. 7.50 కోట్లు డిమాండ్ చేసింది
పఠాన్ కోట్ లో ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి సైన్యం వచ్చిందని, అందుకు ప్రతిఫలంగా కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ను రూ. 7. 50 కోట్లు అడిగిందని, ఆ డబ్బు తన ఎంపీ నిధుల నుంచి తీసుకోవాలని అప్పట్లో తానే కేంద్ర ప్రభుత్వానికి చెప్పానని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

సీఎం సంచలన ఆరోపణలు
2016లో పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు చోరబడిన సమయంలో కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పఠాన్ కోట్ కు సైనికులను పంపించిందని, అప్పుడే పంజాబ్ ను రూ. 7.50 కోట్లు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ను కోరిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ఆరోపణలు చేశారు.

నేనే సాక్షం అంటున్న నేటి పంజాబ్ సీఎం
అప్పట్లో కేంద్ర హోమ్ మంత్రిగా ఉన్న రాజ్ నాథ్ సింగ్ ను నేను, ఆప్ నాయకుడు సాధు సింగ్ కలిశామని, ఆ రోజు పఠాన్ కోట్ కు సైనికులను పంపించునందుకు రూ. 7. 50 కోట్లు ఇవ్వాలని రాజ్ నాథ్ సింగ్ మాకు చెప్పారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. భారతదేశంలో పంజాబ్ ఒక భాగం కాదని మీరు లిఖితపూర్వకంగా రాసిస్తే రూ. 7.50 కోట్లు మేము ఇస్తామని ఆ రోజు తాను చెప్పానని, తరువాత కేంద్ర ప్రభుత్వం సైలెంట్ అయిపోయిందని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.

బూచిగా చూపిస్తున్న ప్రతిపక్షాలు ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు సందర్బంగా పాకిస్తాన్ కు ఆకస్మికంగా వెళ్లి ఆయనకు పుట్టినరోజు శుభకాంక్షలు చెప్పారు. నరేంద్ర మోదీ పాకిస్తాన్ వెళ్లి వచ్చిన కొద్ది రోజులకే పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేశారు. పఠాన్ కోట్ ఉగ్రదాడికి జేఈఎం చీఫ్ మసూద్ అజార్ కారణం అని భారత్ ఆరోపిస్తున్నది. నరేంద్ర మోదీ పాకిస్తాన్ కు వెళ్లడం వలనే ప్రతీకారంగా ఉగ్రవాదులు పఠాన్ కోట్ మీద దాడులు చేశారని అప్పట్లో కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి.