వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత మార్పిడిలు ఏంటీ..? జగజిత్‌కు అండగా ఉంటామని అమరీందర్ భరోసా, ఇమ్రాన్‌ఖాన్‌ సర్కార్‌పై నిప్పులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ అమృత్‌సర్ : పాకిస్థాన్‌లో బలవంతంగా మతమార్పిడికి గురైన యువతులకు అండగా ఉంటామన్నారు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్. జగ‌జిత్‌ కౌర్ ఇండియా రావాలని ... పంజాబ్ వస్తే వారికి కావాలసిన ఏర్పాట్లు చేస్తామని హామీనిచ్చారు. ఈ అంశంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. బలవంతంగా మత మార్పిడి సరికాదని సూచించారు. ఈ అంశంపై అంతర్జాతీయ సమాజంలో పోరాడాలని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు సూచించారు అమరీందర్ సింగ్.

వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!

మత మార్పిడిలు ..

మత మార్పిడిలు ..

పాకిస్థాన్‌లో బలవంతంగా మత మార్పిడిలు ఏంటి అని ప్రశ్నించారు అమరీందర్ సింగ్. అక్కడ అన్యాయానికి గురైన జగజిత్ కౌర్‌కు న్యాయం చేసేందుకు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ముందుకురాలేదన్నారు. ఇది సరికాదని మండిపడ్డారు. జగజిత్ కౌర్ అనే అమ్మాయి .. తనకు ఇష్టం లేకుండా మత మార్పిడి చేయడం సరికాదని ట్వీట్ చేశారు. ఆ యువతికి తాను అన్నివిధాలా మద్దతు తెలుపుతానని ప్రకటించారు. ఆమె తన కుటుంబంతో కలిసి ఇండియా రావాలని సూచించారు. పంజాబ్ వస్తే వారికి వసతి సౌకర్యం కల్పిస్తానని స్పష్టంచేశారు.

మిస్సింగ్ .. ఆపై

మిస్సింగ్ .. ఆపై

పాకిస్థాన్‌లో జగజిత్ కౌర్ అనే అమ్మాయి కనిపించలేదు. నాలుగురోజుల తర్వాత ఆచూకీ లభించింది. అయితే ఓ ముస్లిం ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత బలవంతంగా మత మార్పిడి చేశాడు. జగజిత్ కౌర్ తంబు సాహిబ్ గురుద్వారాలో మత గురువు కూతురు. ఆమె పాయింట్ బ్లాంకులో తుపాకీ పెట్టి మత మార్పిడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. దీంతో నిన్న సిక్కులు ఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందించారు.

ఖండన ..

ఖండన ..

జగజిత్ కౌర్ మత మార్పిడిని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు, అకాళిదల్ నేత మజిందర్ సింగ్ సిర్సా ఖండించారు. దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక్క జగజిత్ కౌర్ కాదు మరో 30 మంది యువతులు కూడా మత మార్పిడి జరిగిందన్నారు. గత 75 రోజుల్లోనే మత మార్పిడిలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా పరిగణించాలని కోరారు.

English summary
punjab Chief Minister Amarinder Singh has offered help to the Sikh girl, who was allegedly abducted and forced to convert to Islam in Pakistan, to come and settle in India. "Even after so many days, Imran Khan has failed to help out Jagjit Kaur, forcibly converted and married against her wishes," the Chief Minister wrote in a tweet on Monday. "I would like to extend my full support to the young girl and will be happy to have her and her family to settle down in Punjab and provide any help if needed," Amarinder Singh added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X