వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిద్దూ... ఇక కామేడీ షోలకే పరిమితమా...? రాజీనామాను అమోదించిన సీఎం

|
Google Oneindia TeluguNews

నెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు అమోదించారు. అనంతరం ఆ లేఖను గవర్నర్ విజయెందర్ పాల్ సింగ్ ఆమోదం కోసం లేఖను పంపారు.

రాజీనామ లేఖపై సిద్దూ జిమ్మిక్కులు

రాజీనామ లేఖపై సిద్దూ జిమ్మిక్కులు

నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రముఖ క్రికెటర్, ఆ తర్వాత టీవీ షోలో యాంకర్‌గా మారిన విషయం తెలిసిందే.... అనంతరం టీవీ షోల్లో హస్యాన్ని పండించే వ్యక్తిగా అందరికి మన్ననలు పోందాడు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ నుండి ఎన్నికైన తర్వాత ఆయన పంచాయితీ రాజ్ శాఖతోపాటు సాంస్కృతిక శాఖలను చేపట్టాడు. వీటితో పాటు మరిన్ని శాఖల భాద్యతలను కూడ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అప్పగించాడు..కాని ఇటివల ఇద్దరి మధ్య పలు కారణాల వల్ల వివాదం చెలరేగింది. కాగా ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కొద్ది రోజుల క్రితం క్యాబినెట్ ప్రక్షాళన చేశాడు. ఇందులో భాగంగానే సిద్ధూకు ఉన్న కొన్ని శాఖలను తొలగించి, ఇతర శాఖలను అప్పగించాడు.అయితే సద్దూ మాత్రం ఆ భాద్యతలను చేపట్టకపోవడంతోపాటు కనీసం సెక్రటేరియట్‌కు కూడ వెళ్లని పరిస్థితి ఉంది.

రాహుల్‌కు గోడు వెళ్లబోసుకున్న సిద్దూ

రాహుల్‌కు గోడు వెళ్లబోసుకున్న సిద్దూ

ఈనేపథ్యంలోనే పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న రాహుల్ గాంధిని కలిసేందుకు సిద్ధూ ఢిల్లికి వెళ్లారు. అయితే అదే సమయంలో రాహుల్ గాంధీ వయానాఢ్‌ పర్యటనలో ఉన్నాడు. కాగా రాహుల్ తిరిగి వచ్చేవరకు ఢిల్లీలోనే ఉన్న సిద్దూ జరిగిన పరిణామాలను రాహుల్‌కు వివరించడంతోపాటు తన రాజీనామ లేఖను కూడ సమర్పించాడు. అయితే రాహుల్‌తో చర్చించిన ఫలితం లేకపోవడంతో అనంతరం ముఖ్యమంత్రి కూడ రాజీనామా లేఖను పంపాడు.

రాజీనామాలో ట్విస్టులు

రాజీనామాలో ట్విస్టులు

ఇక రాజీనామా లేఖను ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్‌కు పంపుతున్నట్టు నెల రోజుల తర్వాత ప్రకటించి అదే విషయాన్ని తన ట్విట్టర్‌లో పేర్కోన్నాడు. దీంతో సిద్దూపై పలు విమర్శలు చేలరేగాయి.బాధ్యతగల మంత్రిగా నెల క్రితం రాజీనామ చేసి తెలపకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారనే విమర్శలు తలెత్తాయి. దీంతోపాటు ఆయనకు ప్రజాస్వామ్యం అంటే సరైన గౌరవం కూడ లేదని పలువురు మండిపడ్డారు. ముఖ్యంగా సిద్దూ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన తర్వాత ఇద్దరు నేతల వివాదానికి కారణమైంది.

English summary
punjab Chief Minister Captain Amrinder Singh has accepted Navjot Singh Sidhu's resignation. The same has now been sent to the Governor of Punjab Vijayender Pal Singh Badnore for approval. Punjab minister Navjot Singh Sidhu had resigned from the state Cabinet few days back
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X