• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పంజాబ్ కాంగ్రెస్‌లో ముదిరిన సంక్షోభం-ఏం జరగబోతుందో-సిద్దూకి మద్దతుగా మంత్రి,ముగ్గురు నేతల రాజీనామా

|

పంజాబ్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ బాధ్యతలు చేపట్టి వారమైనా గడవకముందే నవజోత్ సింగ్ సిద్దూ రాజీనామా రూపంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా తర్వాత సిద్దూ అనుకూల వర్గం ఆయన వెనుక ర్యాలీ అవుతోంది. సిద్దూకి మద్దతుగా ఇప్పటికే మంత్రి రజియా సుల్తానా,పీసీసీ కోశాధికారి గుల్జార్ ఇంద‌ర్ చాహ‌ల్‌, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ప‌ర్గ‌త్ సింగ్‌,యోగేందర్ ధింగ్రా రాజీనామా చేశారు. ప్రస్తుతం సిద్దూను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను గద్దె దించడంలో సిద్దూ తెర వెనుక మంత్రాంగం నడిపారనే వాదన ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా అమరీందర్ కంటే సిద్దూకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వస్తోంది.ఆయనకు పీసీసీ చీఫ్ కట్టబెట్టడం... ఆయనతో పొసగని అమరీందర్‌ను గద్దె దించడం... ఇంత చేసినా సిద్దూ పార్టీలో అలజడి రేపుతూనే ఉన్నారు. సిద్దూ తాజా రాజీనామా వెనుక స్పష్టమైన కారణాలేంటన్నది తెలియలేదు.ఆయన సీఎం పదవిని ఆశిస్తున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.

punjab congress crisis minister and three congress leaders resigns in solidarity to sidhu

తాను సూచించిన కొంతమంది ఎమ్మెల్యేలకు కేబినెట్‌లో స్థానం దక్కకపోవడం... ఇసుక మైనింగ్‌ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కపుర్తలా ఎమ్మెల్యే రాణా గుర్జిత్‌ సింగ్‌కు బెర్త్‌ ఇవ్వడమే సిద్దూ రాజీనామాకు ప్రధాన కారణంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సిద్దూ రాజీనామాపై సీఎం చరణ్‌జిత్‌ ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సిద్దూను ఇప్పటికీ పిసిసి అధ్యక్షుడిగానే భావిస్తున్నామని, ఒకవేళ ఆయనకు ఏమైనా అసంతృప్తి ఉంటే దాన్ని పరిష్కరించుకుంటామని తెలిపారు.

సిద్దూ రాజీనామాను పార్టీ అధిష్టానం ఇంకా ఆమోదించలేదని తెలుస్తోంది. రాజీపడడం మొదలు పెడితే ఒక మనిషి వ్యక్తిత్వం కోల్పోయినట్లేనని సిద్దూ తన లేఖలో పేర్కొన్నారు. పంజాబ్‌ భవిష్యత్తు, సంక్షేమ అజెండా విషయంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. మరోవైపు,సిద్దూకి మద్దతుగా మరికొందరు నేతలు రాజీనామాలకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.అదే జరిగితే మున్ముందు పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనన్న టెన్షన్ కాంగ్రెస్ హైకమాండ్‌ను వెంటాడుతోంది.

ప్రస్తుతం మాజీ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ ఢిల్లీలో ఉన్నారు.ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాల‌తో అమరీందర్ భేటీ అవబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే అమరీందర్ మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు.ఢిల్లీ పర్యటనలో తాను ఏ రాజకీయ నాయకుడిని కలవబోవట్లేదని చెప్పారు.ఢిల్లీలోని తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. సిద్దూ రాజీనామాపై స్పందించిన అమరీందర్... తాను ముందే చెప్పానుగా అతనికి స్థిరత్వం లేదని.. పంజాబ్‌ లాంటి సరిహద్దు రాష్ట్రానికి సిద్దూ సరికాదని వ్యాఖ్యానించారు.

  Bus పై Elephant ఎటాక్.. Driver సమయస్ఫూర్తితో ప్రయాణికులు సేఫ్ || Oneindia Telugu

  పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి సిద్దూ తన రాజీనామా ఉప‌సంహ‌రించుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరా విజ్ఞప్తి చేశారు. పంజాబ్‌లో అవినీతికి వ్య‌తిరేకంగా సిద్ధూ నిలిచార‌ని పేర్కొన్నారు.అతను మౌనంగా ఉండే వ్యక్తి కాదని... ఆయ‌న సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుంటే పీసీసీ అధ్య‌క్షుడిగా కొనసాగలేర‌ని అన్నారు. సిద్ధూ అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కాంగ్రెస్ హైకమాండ్‌ను కోరారు.సిద్దూ రాజీనామా వెనక్కి తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు.

  English summary
  The political crisis in the Punjab Congress has intensified. Less than a week after Charanjit Singh Channy took over as the new Chief Minister, an unexpected turn of events took place in the form of the resignation of Navjot Singh Sidhu. A pro-Sidhu faction is rallying behind him after he resigned as PCC chief. In solidarity with Sidhu, Minister Razia Sultana, PCC treasurer Gulzar Inder Chahal, chief secretaries Purgat Singh and Yogender Dhingra have already resigned.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X