వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల నిరసనకు మద్దతుగా పంజాబ్ జైళ్ల శాఖ డీఐజీ తన పదవికి రాజీనామా

|
Google Oneindia TeluguNews

ఛండీగఢ్: పంజాబ్ రైతుల నిరసనకు మద్దతు పెరుగుతోంది. పంజాబ్ జైళ్ల శాఖ డీఐజీ లక్ష్మీందర్ సింగ్ జాఖర్ రాజీనామా చేశారు. రైతుల ఆందోళనకు మద్దతుగా తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి శనివారం అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు.

తన రాజీనామాను ముందస్తు రిటైర్మెంట్ వల్లే పరిగణించాలని ఆయన రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆయన కోరారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సోదరులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలవాలనుకున్న నిర్ణయాన్ని అందరికీ తెలియజేస్తున్నట్లు లక్ష్మీందర్ తెలిపారు.

 Punjab DIG Prisons resigns in support of farmers’ protest

ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు పలు మార్గాల నుంచి మద్దతు లభించింది. పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ తన పద్మ అవార్డును తిరిగి ఇస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఎస్ఏడీ నాయకుడు సుఖ్ దేవ్ సింగ్ దిండ్సా కూడా పద్మభూషణ్ వాప్ చేశారు. పంజాబ్ కవి సూర్జిత్ పతార్ కూడా పద్మశ్రీని వాపస్ చేయాలని నిర్ణయించుకున్నారు.

కాగా, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న ఎస్ఏడీ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్త్తూ కూటమి నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. కేంద్రంలో కేంద్రమంత్రిగా ఉన్న హర్ సిమ్రత్ కౌర్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా, గత 15 రోజులకుపైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు.

English summary
Expressing solidarity with protesting farmers, a serving officer of the Punjab police resigned from his post on Saturday. Lakhminder Singh Jakhar, who was posted as Deputy Inspector General (DIG), Prisons, in Chandigarh, said he resigned on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X