వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోసారి అకాలీ ‘బాబా’కు చాన్స్ మిస్

దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాడే రాజకీయాల్లో ప్రవేశించి .. పంజాబ్ పరిణామాల్లో డెబ్బయి ఏళ్లుగా తనదైన శైలిలో చెరగని ముద్ర వేసిన నేపథ్యం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్‌ది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాడే రాజకీయాల్లో ప్రవేశించి .. పంజాబ్ పరిణామాల్లో డెబ్బయి ఏళ్లుగా తనదైన శైలిలో చెరగని ముద్ర వేసిన నేపథ్యం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్‌ది. 89 ఏళ్ల వయస్సులో వరుసగా మూడోసారి.. జీవితంలో ఆరోసారి రాష్ట్ర సీఎంగా పదవీ ప్రమాణం చేసే అవకాశాన్ని ప్రకాశ్ సింగ్ బాదల్ కోల్పోయారు.

2007లో సీఎంగా ప్రమాణం చేసినప్పుడు నేను పరుగెత్తగలను. మీరు చూస్తారా? అని మీడియాతో చమత్కరించారు. 2012లోనే దేశంలోకెల్లా వృద్ధుడైన ముఖ్యమంత్రిగా బాదల్ నిలిచారు. కానీ వరుసగా పదేళ్ల పాటు సాగిన బాదల్ ప్రభుత్వం హయాంలో డ్రగ్స్ మాఫియా, ఇతర అంశాల్లో బాదల్ కుటుంబం అవినీతి తదితర అంశాల్లో ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తడంతో 2017లో అసాధారణ రీతిలో ఆయన రాజకీయ జీవితం ముగిసింది.
తన సన్నిహితులంతా 'బాబా'గా ముద్దుగా పిలుచుకునే బాదల్ 1927 డిసెంబర్ 8వ తేదీన జన్మించారు.
లాహోర్‌లోని క్రిస్టియన్ కళాశాలలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న బాదల్ సారథ్యంలోని ఎస్‌ఏడీ 1966లో పంజాబ్ విభజన తర్వాత వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలన్న కల కలగానే మిగిలింది. 1947లో అకాలీదళ్‌లో చేరడంతోపాటు తొలిసారే 20 ఏండ్ల యువకుడిగా సొంత గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా.. తర్వాత బ్లాక్ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

1957లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక
అకాలీదళ్, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తుతో 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాలౌట్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.1969లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో గిద్దర్‌బహా స్థానం నుంచి రెండోసారి ఎన్నికైన బాదల్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. నాటి సీఎం గుర్నాంసింగ్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు.

జన్‌సంఘ్, ఎస్సెస్పీ మద్దతుతో సీఎంగా బాదల్
కానీ అకాలీ ఎమ్మెల్యేలంతా కలిసి బాదల్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడంతో జనసంఘ్, ఎస్సెస్పీల మద్దతుతో 1970 మార్చి 27న తొలిసారి సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించారు. కానీ అనునిత్యం సమస్యలతో 15 నెలల తర్వాత 1971 జూన్ 13న అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేశారు. 1972లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బాదల్ విపక్ష నేతగా పనిచేశారు. తిరిగి 197780 మధ్య 32 నెలల పాటు సీఎంగా పని చేశారు.

ఇలా పార్టీ ఏర్పాటు

ఇలా పార్టీ ఏర్పాటు

1980, 1985లలో ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రకాశ్ సింగ్ బాదల్.. 1985లో సూర్జిత్ సింగ్ బర్నాలా క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పనిచేసేందుకు నిరాకరించారు. 1985 ఎన్నికల తర్వాత పార్టీలో విభేదాలతో బయటకు వచ్చిన బాదల్.. ఎస్‌జిపిసిలోని గుర్నాంసింగ్ వంటి తన మద్దతుదారులు తో కలిసి శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) ఏర్పాటు చేశారు. 20 ఏండ్ల విరామం తర్వాత బీజేపీ మద్దతుతో 1997లో మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు.

ఎస్ఎడి అధ్యక్షుడిగా కొడుకు సుఖ్ బీర్

ఎస్ఎడి అధ్యక్షుడిగా కొడుకు సుఖ్ బీర్

ఆయన కొడుకు సుఖ్ బీర్ సింగ్ బాదల్ కూడా జలాలాబాద్ నుంచి ప్రస్తుతం అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సుఖ్ బీర్ బార్య హర్ సిమ్రత్ కౌర్ కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. పలువురు బాదల్ కుటుంబ సభ్యులు అసెంబ్లీకి ఎన్నికైన వారిలో ఉన్నారు. ఒకవేళ తమ కూటమి గెలుపొందినా తమ తండ్రి ప్రకాశ్ సింగ్ బాదల్ సీఎంగా ఉంటారని సుఖ్ బీర్ సింగ్ బాదల్ అన్నారు.

మూడో సారి నెరవేరని కల

మూడో సారి నెరవేరని కల

కానీ ఒక ప్రతాప్ సింగ్ ఖైరోన్, గోపీచంద్ భార్గవ మాదిరిగా మూడోసారి వరుసగా సీఎం కావాలన్న ప్రకాశ్ సింగ్ బాదల్ కలలు మాత్రం సాకారం కాలేదు. గోల్డెన్ టెంపుల్ లో తిష్ట వేసిన మిలిటెంట్లను తరిమి కొట్టేందుకు ఆర్మీ రంగ ప్రవేశం చేసిన 'ఆపరేషన్ బ్లూస్టార్'తోపాటు ధర్మ యుద్ధ మోర్చా వంటి ఆందోళనల సమయంలో అరెస్ట్ అయ్యారు.

సిఎంగా ఉచిత విద్యుత్తు హామీ

సిఎంగా ఉచిత విద్యుత్తు హామీ

మూడోసారి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ప్రకాశ్ సింగ్ బాదల్ రైతులకు ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు రైతుల నుంచి నీటి సరఫరాపై పన్ను వసూళ్లు నిలిపివేశారు. ఆయన హయాంలోనే థెయిన్ డ్యామ్ నిర్మాణం పూర్తి కావడం గమనార్హం. లాంబ్రీ స్థానం నుంచి 2002లోనూ ఎన్నికైన ప్రకాశ్ సింగ్ బాదల్ సారథ్యంలోని అకాలీదళ్ - బీజేపీ కూటమి అధికారంలోకి రాలేకపోయింది. 2012, 2017 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

English summary
Eighty-nine-year-old Parkash Singh Badal's dream of becoming the chief minister of Punjab thrice in a row and the sixth time overall will remain unfulfilled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X