వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెన్నుపోటు!: పంజాబ్‌లో కాంగ్రెస్ గెలిచేనా, సిద్ధూకు పరీక్ష

చండీగఢ్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేరిక.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేదే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి.

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేరిక.. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చేదే. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు సిద్ధూ చేరికతో కాంగ్రెస్‌కు మరింత ప్లస్ అయింది. అయితే, సిద్ధూకు మాత్రం ఇది పెద్ద పరీక్షే.

మోడీ కూటమికి చెక్, కేజ్రీ అంతంతే: పంజాబ్‌లో కాంగ్రెస్ కల ఫలిస్తుంది!మోడీ కూటమికి చెక్, కేజ్రీ అంతంతే: పంజాబ్‌లో కాంగ్రెస్ కల ఫలిస్తుంది!

సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరి తల్లిలాంటి బీజేపీకి వెన్నుపోటు పొడిచారని కమలనాథులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ గెలపవకపోయినా, హంగ్ వచ్చినా.. అప్పుడు బీజేపీ మరింత ఎదురు దాడి చేసే అవకాశముంది.

ఉప ముఖ్యమంత్రి ఛాన్స్

ఉప ముఖ్యమంత్రి ఛాన్స్

కాంగ్రెస్ పార్టీలో చేరిన సిద్ధూ అమృత్‌సర్ ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశముంది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అవుతారు. సిద్ధూను ఉప ముఖ్యమంత్రిని చేసే అవకాశముంది. పంజాబ్‌లో ఇప్పటికీ సిద్ధుకు ఇమేజ్ ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తుంది.

యువత ఓట్లు

యువత ఓట్లు

పంజాబ్‌లో దాదాపు యాభై శాతం మంది ఓటర్లు 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు వారు. యువత ఏఏపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కారణంగా ఇది సిద్ధూకు క్లిష్టమైన ఎన్నికలేనని చెప్పవచ్చు.

సిద్ధూ

సిద్ధూ

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పంజాబ్‌లో సిద్ధూనే ప్రధాన ప్రచారకర్త. ఇతను దాదాపు 70 ర్యాలీలలో పాల్గొనవచ్చు. యువతలో అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఇతను ఓటు పుల్లర్. అదే యువత ఏఏపీ వైపు చూస్తుండటమే ఇక్కడ ఆసక్తికర విషయం. యువతను సిద్ధూ తన వైపుకు తిప్పుకుంటారా లేక ఏఏపీ సిద్ధూను దెబ్బతీస్తుందా చూడాలి.

యాంటీ అకాలీదళ్ ఓటు

యాంటీ అకాలీదళ్ ఓటు

సిద్ధూ అకాలీ దళ్ వ్యతిరేక ఓటును కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్లించగలరు. ఇప్పటికే అధికార అకాలీ దళ్ డ్రగ్స్ వంటి కీలక ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ కారణంగానే అకాలీదళ్ ఈసారి గెలుపు విషయం పక్కన పెడితే కనీసం రెండు డిజిట్ల సీట్లు సాధిస్తుందా అనేది అనుమానంగా ఉందంటున్నారు. అకాలీ వ్యతిరేక ఓటుతో పాటు ప్రభుత్వం వ్యతిరేక ఓటు, యువత ఓట్లు సిద్ధూ రాబడతారని అంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కలిసి వస్తాయంటున్నారు.

తల్లికి వెన్నుపోటీ.. బీజేపీ మాట

తల్లికి వెన్నుపోటీ.. బీజేపీ మాట

117 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 110 స్థానాల్లో పోటీ చేయనుంది. సిద్ధూ కాంగ్రెస్ పార్టీలో చేరడం బీజేపీకి పెద్ద దెబ్బే. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ ఆయనపై మండిపడుతోంది. అతనిని బ్యాడ్ సన్‌గా పేర్కొంది. బీజేపీ అతని తల్లి వంటిదని, అతను తల్లిని చీట్ చేశాడని బీజేపీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ సంప్లా చెప్పారు. బీజేపీకి ఆయనకు ఎంతో చేసిందని, ఆయన బీజేపీకి చేసిందేం లేదన్నారు.

ఇదీ సిద్ధూ రాజకీయ జర్నీ

ఇదీ సిద్ధూ రాజకీయ జర్నీ

2004లో సిద్ధూ అమృత్‌సర్ లోకసభ నుంచి బీజేపీ టిక్కెట్ పైన గెలిచారు. 1998లోని ఓ కేసుకు సంబంధించి 2006లో రాజీనామా చేశారు. సుప్రీం కోర్టు నుంచి తనకు అనుకూలంగా తీర్పు వచ్చాక 2007 ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో మరోసారి బీజేపీ తరఫున గెలిచారు. 2014 ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి అరుణ్ జైట్లీ పోటీ చేయడంతో, సిద్ధూ పోటీ చేయలేదు.

English summary
In all possibilities, cricketer-turned-politician Navjot Singh Sidhu will bring good luck for the Congress in the upcoming Punjab polls, say experts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X