వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్కశ తల్లి: కూతురు ప్రేమించిందని ఘాతుకం, నిద్రమాత్రలు ఇచ్చి హత్య, ఆపై దహనం...

|
Google Oneindia TeluguNews

ప్రేమించడమే ఆ యువతి పాలిట శాపమైపోయింది. విషయం తెలిసిన కన్నతల్లి.. బంధువుల సహకారం తీసుకొని హతమార్చింది. తర్వాత రహస్యంగా దహనం చేసి.. ఏమీ ఏరగన్నట్టు బిల్డప్ ఇచ్చింది. కానీ చివరకు పోలీసులకు దొరికి.. జైలులో ఊఛలు లెక్కబెడుతోంది. పంజాబ్‌లో జరిగిన ఘటన ఆందోళన కలిగిస్తోంది.

సొంత కూతురినే..

సొంత కూతురినే..

పంజాబ్ హోషియార్‌పూర్‌కి చెందిన బల్విందర్ అనే వివాహితకు జస్‌ప్రీత్ కౌర్ అనే యువతి ఉంది. ఆమె భాజి‌లాన్‌కి చెందిన అమన్ ప్రీత్ సింగ్ అలియాస్ అమన్‌ను ప్రేమించింది. అందరిలాగే వీరి ప్రేమను కూడా పెద్దలు అంగీకరించలేదు. ఏం చేయాలా అని తల్లి ఆలోచించింది. కుటుంబసభ్యులతో చర్చించి.. మట్టుబెట్టాలని నిర్ణయానికి వచ్చింది. అదనుచూసి సొంత కూతురినే మట్టుబెట్టింది.

నిద్రమాత్రలు ఇచ్చి

నిద్రమాత్రలు ఇచ్చి

ఈ నెల 25వ తేదీ రాత్రి తన కూతురికి నిద్రమాత్రలు ఇచ్చింది. ఆమె పడుకున్నాక బంధువులు యువతి గొంతునులిపి హతమార్చారు. ఆ తర్వాత ఏం చేయాలి అని ఆలోచించి.. ఇద్దరు నిందితులు సాదేవ్, గుర్ దీప్ కలిసి యువతి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత తల్లి నాటకం ఆడటం ప్రారంభించారు. తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమన్‌పై అనుమానం..?

ఆమన్‌పై అనుమానం..?

పోలీసులకు కంప్లైంట్ చేసి వదిలేయకుండా ఆమన్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఇటీవల ఆమన్ ప్రేమ విషయం తమకు తెలిసిందని.. ఇంట్లో నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే గర్షాంకర్ రైల్వేస్టేషన్ నుంచి వెనక్కి తీసుకొచ్చామని.. ఆమన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిందని తెలిపారు. దీంతో పోలీసులు ఆమన్‌‌తోపాటు తల్లి బల్విందర్‌పై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టారు.

Recommended Video

IPL 2020 : 4 Instances When Cricketers Cried in IPL
నేరాంగీకారం...

నేరాంగీకారం...

బల్వింద్‌ను పోలీసులు తనదైనశైలిలో ప్రశ్నిస్తే.. నిజాన్ని అంగీకరించింది. కూతురిని హత్య చేసింది తానేనని ఒప్పుకున్నది. ఆమెకు కుటుంబసభ్యులు సహకారం అందించారని తెలిపారు. మృతురాలి తల్లి బల్విందర్, మామ సదేవ్, కజిన్ గుర్దీప్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిలో గుర్దీప్ సింగ్ పంజాబ్ సీఎం సెక్యూరిటీ వింగ్‌లో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.

English summary
Punjab Police in Hoshiarpur has booked five people in connection with the murder of a 19-year-old woman who was killed by her family and later cremated in secrecy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X