పంజాబ్‌లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆప్.. గోవాలో అపోజిషన్ రోల్..

పంజాబ్, గోవా ఓటర్ల తీరు ఎలా ఉండబోతుంది. ఏ పార్టీకి పట్టం కట్టబెట్టబోతున్నారా అనే అంశానికి సంబంధించి ఏబీసీ సీ ఓటర్ సర్వే అసక్తికర అంశాలను తెలియజేసింది. పంజాబ్‌ ప్రజలు ఆప్‌కు పట్టం కడతారని పేర్కొంది. మరోసారి అధికారం చేపడుతామనే కాంగ్రెస్ ఆశలపై సర్వే నీళ్లు చల్లింది. పంజాబ్‌కు సంబంధించి ఏబీపీ మూడో సారి సర్వే చేపట్టింది. పంజాబ్‌‌లో ఇదివరకు కాంగ్రెస్- ఆకాళిదల్ బీజేపీ ద్వయం మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు ఆప్ 50 నుంచి 56 సీట్లు గెలుచుకుని కీలకంగా మారనుందని తెలిపింది.

అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం 39-45 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. ఆకళిదల్ 17 నుంచి 23 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీ 3 సీట్లకే పరిమితం అవుతుందని వివరించింది. ఇక సీఎం అభ్యర్థి విషయానికి వస్తే చరణ్ జిత్ సింగ్‌ను మరోసారి పంజాబ్ 32.9 శాతం మంది మాత్రమే ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారట. అరవింద్ కేజ్రీవాల్ 23.7 శాతం, ఆకాళిదల్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ 17.5 శాతం, ఆప్ భగవాన్ మాన్ 12.8 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. మాజీ సీఎం అమరీందర్ సింగ్ అంతగా ప్రభావం చూపరని పేర్కొంది.

Punjab, Goa Election 2022 Opinion Poll Result: Here is What ABP-CVoter Survey Says

గోవాలో మాత్రం బీజేపీకి మరోసారి పట్టం కడతారని ఏబీపీ సర్వే తెలిపింది. ప్రమోద్ సావంత్ నేతృత్వంలో 17-21 సీట్లు గెలుచుకుంటారని పేర్కొంది. గత టర్మ్‌లో బీజేపీ 11 సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. గతంలో 17 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఈ సారి 4 నుంచి 8 సీట్లకే పరిమితం అవుతుందట. ఆప్ మాత్రం 5 నుంచి 9 సీట్లు గెలిచి విపక్ష పాత్ర పోషిస్తోందని అంచనా వేసింది. సీఎం పదవీకి ప్రమోద్ సావంత 29.3శాతం, ఆప్ అభ్యర్థి 20.5 శాతం, కాంగ్రెస్ దిగంబర్ కామత్ 13.5 శాతం, బీజేపీ విశ్వజిత్ రాణే 11.8 శాతం మంది ప్రజలు అంగీకరిస్తారని పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ కీలక పాత్ర పోషించనుంది. కాంగ్రెస్, బీజేపీని కాదని.. ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని విశ్వసించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+