వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్.. జమ్ము, పంజాబ్ రక్షణ స్థావరాలకు ఆరంజ్ అలర్ట్ జారీ

|
Google Oneindia TeluguNews

దాయాది పాకిస్థాన్ కుటీల బుద్ధి మారడం లేదు. కుక్క తోక వంకర అన్నట్టు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారత్‌పై పురిగొల్పడమే పనిగా మారింది. తాజాగా పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు భారత్‌లో చొరబడ్డారని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో రక్షణశాఖ స్థావరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పంజాబ్ మీదుగా భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.

భారత రక్షణ సంస్థలపై దాడి చేసే అవకాశం ఉందని అలర్ట్ చేశాయి. దీంతో పఠాన్‌కోట్, జమ్ము, శ్రీనగర్, అవంతిపొర వద్ద రక్షణశాఖ స్థావరాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదులు చొరబడ్డారనే సమాచారంతో ఆరెంజ్ అలర్ట్ కూడా జారీచేశారు. పంజాబ్, జమ్ముకశ్మీర్‌లో ఉన్న రక్షణ స్థావరాల వద్ద భారీగా భద్రతను మొహరించారు. ఇవాళ ఉదయం నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతాపరమైన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా రక్షణశాఖ స్థావరాలు, వాయుసేన స్థావరాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Punjab, Jammu defence bases on orange alert

జమ్ముకశ్మీర్ విభజన తర్వాత కశ్మీర్‌లో పరిస్థితి మారిపోయింది. ఉగ్రవాదులకు ఊతమిస్తూ పాకిస్థాన్ చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద ముష్కరులను భారత భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉన్నారు. మరోవైపు గత నెలలో 10 మంది జైషే ఉగ్రవాదులు చొరబడినట్టు ఐబీ అప్రమత్తం చేసింది. వారు జమ్ము కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించడంతో భద్రతా విభాగాలు అలర్టయ్యాయి. 2016లో పాకిస్థాన్‌కు చెందిన నలుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు పఠాన్‌కోట్‌లో చొరబడిన సంగతి తెలిసిందే. వారిని భద్రతాదళాలు మట్టుబెట్టాయి.

English summary
intelligence agencies shared an input that a large group of terrorists from Pakistan has infiltrated into the Indian territory in an around Punjab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X