వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగవంతున్ని కోలుస్తూ... అంబులెన్స్‌కు దారి ఇస్తూ.... పూరీలో మానవత్వం పరిళమళించిన వేళ... వీడీయో

|
Google Oneindia TeluguNews

ఓ వైపు లక్షలాది భక్తులు, మరోవైపు ప్రాణప్రాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి ఉన్న అంబులెన్స్ అటుగా వచ్చింది. సాధారణంగా అయితే అంబులెన్స్‌కు దారి ఇవ్వడమే కష్టమవుతోంది. కాని ముందే ఏర్పాటు చేసిన ప్రైవేటు సైన్యం, ఇలాంటీ ఆపదలు ఎవైన వస్తే ఎదుర్కోవడానికి ప్రణాళిక ఉండడంతో ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని తీసుకెళుతున్న అంబులెన్స్ లక్షలాదీ మందిలో నుండి ఎలాంటీ ఇబ్బంది లేకుండా దూసుకువెళ్లింది. దీంతో స్థానికంగా ఉన్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ వీడీయో జిల్లా ఎస్పీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

ఈ నెల 4 నాలుగు పూరీలో జగన్నాథ యాత్ర అంగరంగవైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే..ఈ యాత్ర జరుగుతున్న నేపథ్యంలో పూరీ పుర వీధులన్ని భక్తులతో కిటకిలాడాయి..భక్తి తన్మయత్వంలో భగవంతున్ని కోలుస్తూ యాత్ర కొనసాగుతోంది. సరిగ్గా ఇదే సమయంలో ఓ అంబులేన్స్ రథయాత్ర మార్గంలో వచ్చింది. దీంతో భక్తులతోపాటు అక్కడున్న 1200 మంది వాలంటీర్లు సమయస్పూర్తిని చాటారు. మానవ సేవయో మాధవ సేవ అనే సూక్తిని అక్షరాల పాటించారు. ఈనేపథ్యంలోనే అంబులెన్స్‌కు దారి ఇచ్చి సురక్షితంగా ర్యాలిని దాటించారు. కాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ పూరీ ఎస్పీ తన ట్విట్టర్ ఖాతాలో వీడీయోను పోస్టు చేశాడు.

 Puri Rath Yatra create a human corridor

దీంతో ఈ వీడియో పలువురు నెటిజన్ల ప్రశంశలు అందుకుంటుంది. ప్రజల్లో ఉన్న మానవత్వ విలువలను చాటిచెప్పే విధంగా ఉందంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఇలాంటీ సంఘటనే కొద్ది రోజుల క్రితం హంకాంగ్‌లో నిరసన కారులు వ్యక్తం చేస్తున్న సంధర్భంలో ఓ నిరసనకారుడు ఆపదలో ఉన్నప్పుడు కూడ అంబులెన్స్‌కు దారి ఇచ్చి తమ మానవత్వాన్ని చాటారు. దీంతో రెండు సంఘటనలను పోల్చుతూ పలువురు నెటిజన్లు ప్రంశంశలు అందించారు.

English summary
in a remarkable feat, around 1200 volunteers and lakhs of devotees at the Jagannath Puri Rath Yatra on July 4 got together to create a human corridor for a safe passage for an ambulance trying to get through.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X