వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బుర్కా వేసుకున్న మాజీ ఎమ్మెల్యే శకుంతుల శెట్టి, సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్, ఏం జరిగింది ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా పుత్తూరు శాసన సభ నియోజక వర్గం మహిళా ఎమ్మెల్యే బుర్కా వేసుకున్న ఫోటోలు బయటకురావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాజీ మహిళా ఎమ్మెల్యే శకుంతుల శెట్టితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది మహిళా నాయకులు సైతం బుర్కాలు వేసుకున్నారు.

పుత్తూరు శాసన సభ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే శకుంతుల శెట్టికి కర్ణాటకలో మంచి గుర్తింపు ఉంది. మాజీ ఎమ్మెల్యే శకుంతుల శెట్టి బుర్కా వేసుకుని సాటి స్నేహితులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలతో కలిసి తీసుకున్న ఫోటోలు బయటకు వచ్చాయి.

Puttur former mla Shakunthala Shettys wearing Burka photo viral in social media.

మాజీ ఎమ్మెల్యే శకుంతుల శెట్టి బుర్కా వేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శకుంతుల శెట్టి ఎందుకు బుర్కా వేసుకున్నారు ? ఎక్కడ ఫోటోలు తీసుకున్నారు అంటూ గురువారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైయ్యింది.

Puttur former mla Shakunthala Shettys wearing Burka photo viral in social media.

ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే శకుంతుల శెట్టి సన్నిహితులు వివరణ ఇచ్చారు. ఇటీవల దుబైలో ప్రపంచ తుళు సమ్మెళనం కార్యక్రమాలు జరిగాయి. ప్రపంచ తుళు సమ్మెళనం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే శకుంతుల శెట్టి తదితరులు హాజరైనారు. గల్ఫ్ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరిగా మహిళలు బుర్కా వేసుకోవాలని నియమాలు ఉన్నాయి.

అలాంటి ప్రదేశాలకు వెళ్లిన శకుంతుల శెట్టి తప్పని పరిస్థితుల్లో బుర్కా వేసుకున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే దక్షణి కన్నడ జిల్లాలో రెండు వర్గాల మద్య నిత్యం గొడవలు జరుగుతుంటాయి. బుర్కా వేసుకునే నిబంధనలు ఉన్న ప్రాంతాలకు మాజీ ఎమ్మెల్యే శకుంతల శెట్టి వెళ్లకపోతే ఏం నష్టం జరిగేది అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

English summary
Karnataka: Puttur former mla Shakunthala Shetty's wearing Burka photo viral in social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X